-సంక్షేమ వసతి గృహ బాలికలకు తాటిబెల్లం పంపిణీ..
-జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రక్తహీనతను నివారించడంలో తాటిబెల్లం ఎంతో శ్రేష్టమైనదని ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల బాలికలకు 30రోజులపాటు తాటి బెల్లం పంపిణీ చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు తెలిపారు.
విజయవాడ పాయకపురం ప్రభుత్వ సాంఫీుక సంక్షేమ వసతి గృహ బాలికలకు మంగళవారం జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు తాటి బెల్లం పంపిణీ చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కౌమార బాలికలలో రక్తహీనతను నివారించేందుకు మూక్తి భారత్ పథకం ద్వారా ఐరన్ పోలిక్ యాసిడ్ టాబులెట్లను పాఠశాలలో కళాశాలలో పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. అదనంగా తాటిబెల్లం పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. జిల్లా వ్యాప్తంగా సాంఫీుక సంక్షేమ వసతి గృహ బాలికలకు తాటి బెల్లం పంపిణీ చేసిన్నట్లు తెలిపారు. తాటి బెల్లం రక్తి హీనత నివారణ మంచి ఫలితాలు ఇస్తుందన్నారు. ఎముకల పటిష్టంగా ఉండి, జీర్ణశక్తి పెరిగి మలభద్దకం తగిస్తుందన్నారు. తాటిబెల్లం బరువు తగ్గి (వెయిట్ లాస్) ఆరోగ్యంగా ఉంటారన్నారు. వసతి గృహ సంక్షేమ అధికారులు విద్యార్థుల ఆరోగ్యపట్ల ప్రత్యేక శ్రద్ద పెట్టాలన్నారు. తరచు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి నెలవారి రక్తహీనత శాతాన్ని గుర్తించి ప్రత్యేక రిజిస్ట్రర్‌లో నమోదు చేయాలన్నారు. రక్తహీనతతో పాటు ఇతర ఆనారోగ్య లక్షణాలను గుర్తిస్తే తక్షణమే ప్రభుత్వ ఆసుపత్రులలో చికిత్స అందించాలని ఆదేశించారు. విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించి పోషికాహార ప్రాధాన్యత తెలిపి ఐరన్ శాతం ఎక్కువ ఉండే పప్పుదినుసులు, ఆకుకూరలు, మిల్లెట్స్ ఉపయోగించేలా చైతన్యవంతులు చేయాలన్నారు.
వసతి గృహా ఆవరణ నిర్వహణ పారిశుద్ద్య పట్ల జిల్లా కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేస్తూ తక్షణమే ఆవరణంలో ఉన్న ఖాళీ ప్రదేశంలో ఆకుకూరలు, కూరగాయ మొక్కలను పెంచేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. బుధవారం చేపట్టే సామూహిక నిర్మూల కార్యక్రమంలో భాగస్వామ్యులై ఆవరణలో పెరిగిన పార్థీనియం మొక్కలను నిర్మూలించాలని కలెక్టర్ డిల్లీరావు ఆదేశించారు.
తాటి బెల్లం పంపిణీ కార్యక్రమంలో జిల్లా సాంఫీుక సంక్షేమ అధికారి ఎన్ వి. విజయభారతి, వసతి గృహా సంక్షేమ అధికారులు పి. సుజాత, సరోజగ్రేస్స్ నార్త్ తహాశీల్థార్ సిహెచ్ దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News