విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో ప్రతి మహిళా ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మహిళా సాదరికతకు కృషి చేస్తున్నారు అని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ పేర్కొన్నారు. మంగళవారం గుణదల బిషప్ గ్రాసి స్కూల్ గ్రౌండ్ జరిగిన 2,6 డివిజిన్ల 3వ విడత వైయస్సార్ ఆసరా పథకం లబ్ధిదారులతో జరిగిన ఆసరా సంబరాలు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న అవినాష్ ఆయా డివిజన్ ల పరిధిలో 430 గ్రూపులకు మంజూరు అయిన 30,519,687/- రూపాయల నమూనా చెక్కును ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా ప్రతి పధకంలో మహిళలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ నేరుగా వారి ఖాతాల్లో నగదు జమ చేస్తున్న ఘనత వైస్సార్సీపీ ప్రభుత్వం దే అని, అదేవిధంగా దిశ ఆప్, దిశ చట్టం తీసుకొచ్చి వారి రక్షణ కు కృషి చేస్తున్నాం అని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలను ఆర్థికంగా శక్తివంతులను చేయడానికి,వారి కాళ్ళ మీద వారు నిలబడేలా చేయడానికి జగన్ గారు వైయస్సార్ ఆసరా ద్వారా వారికి ఆర్థిక సహాయం చేస్తూ స్వయం ఉపాధి కల్పన చేస్తున్నారు అని,అదేవిధంగా అమ్మఒడి, చేయూత ఇలా ప్రతి పధకంలో నేరుగా మహిళలకు లబ్ది చేకూరేలా అమలు చేయడంతో పాటు ఇళ్ల పట్టాలు కూడా వారి పేరు మీదనే ఇస్తూ అసలైన మహిళ పక్షపతిగా నిలిచారని కొనియాడారు.మహిళలలో రోజురోజుకు ముఖ్యమంత్రి కి పెరుగుతున్న ఆదరణ చూసి,ఇళ్ల నిర్మాణాలు కూడా పూర్తి అయితే ఇక వారికి రాజకీయ భవిష్యత్ ఉండదు అనే దుర్బుద్ధితో ప్రతిపక్ష పార్టీలు కోర్టులు ద్వారా ఇళ్ల నిర్మాణం అడ్డుకోవడం దారుణమని విమర్శించారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసిన పేదవారి సొంతింటి కలను జగన్ గారు నెరవేరిస్తారని భరోసా ఇచ్చారు. ప్రభుత్వం అందిస్తున్న సహకారంతో మహిళలు ఆర్థికంగా, సామాజికంగా పై స్థాయిలో నిలవాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో ప్రాజెక్ట్ ఆఫీసర్ శంకుతల,2వ డివిజన్ కార్పొరేటర్ అంబలపూడి నిర్మలా కుమారి,6వ డివిజన్ కార్పొరేటర్ వియ్యపు అమరనాథ్,రాష్ట్ర తూర్పు కాపు కార్పొరేషన్ డైరెక్టర్ ఇజ్జాడ తేజ,సీడీఓ ఉమామహేశ్వరి,వక్ఫ్ బోర్డు మెంబెర్ మొహ్మద్ మొయిన్, వైసీపీ నాయుకులు చిన్నబాబు,కోటినాగులు మరియు రెండు డివిజన్ల ముఖ్య నాయుకులు,కార్యకర్తలు,సచివాలయ గృహసారదులు,కన్వీనర్లు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News