Breaking News

రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిన ఘనత తెలుగుదేశం పార్టీదే : దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర విభజన తరువాత చంద్రబాబు నాయుడు అనుభవం మీద నమ్మకంతో ప్రజలు తెలుగుదేశం పార్టీకి అధికారం అప్పజెపితే రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి వారి నమ్మకాన్ని వమ్ము చేసారని తూర్పు నియోజకవర్గ వైస్సార్సీపీ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ ఘాటుగా విమర్శించారు. మంగళవారం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా 15వ డివిజన్ 71వ సచివలయాల పరిధిలో గాంధీ కాలనీ,ఎర్రపోతు వారి స్ట్రీట్ ప్రాంతాలలో ఇంటింటికి వెళ్లిన అవినాష్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, చేస్తున్న అభివృద్ధి గురించి వివరిస్తూ వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వారి కుటుంబాలకు అందుతున్న సంక్షేమ లబ్ది వివరాల కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ గత టీడీపీ హయాంలో వారి ప్రచార ఆర్భాటాలకు,హంగులకు కోట్లాది రూపాయలు ఖర్చు చేసి ,పోలవరం, అమరావతి పేరుతో వారి నాయకులు వేల కోట్ల రూపాయలు అవినీతి చేసి సొంత ఆస్తులు పెంచుకొని రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో పడేసారని, ప్రజలకు వాస్తవాలు తెలిసి వారికి తగిన బుద్ధి చెబుతూ వైస్సార్సీపీ కి ఘన విజయాన్ని అందించారని అన్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  జనరంజకంగా పరిపాలన అందిస్తూ అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తున్నారని అన్నారు. ప్రతి పధకంలో మహిళలకు పెద్దపీట వేస్తూ సంక్షేమ లబ్ధిని నేరుగా వారి ఖాతాలలో జమ చేస్తున్నారు అని చెప్పారు. ఒకప్రక్క జగనన్న సంక్షేమ పాలన అందిస్తూ ప్రజలలో రోజురోజుకు ఆదరణ పెరిగుతుంటే ఓర్వలేక ప్రతిపక్ష టీడీపీ తమ అనుకూల మీడియా, సోషల్ మీడియాలలో రాష్ట్రం అప్పుల పాలు అని అసత్య ప్రచారాలు చేస్తున్నారు అని, మీరు రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి అప్పజెపితే జగన్ వాటికి కూడా వడ్డీలు కడుతూ, మీరు పెండింగులో పెట్టిన బిల్లులను కూడా చెల్లిస్తున్నారని తెలిపారు. మీరు ఎన్ని కుట్రలు చేసిన ప్రజల మద్దతు వైసీపీ కె అని అవినాష్ ధీమా వ్యక్తంచేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ,మాజీ డిప్యూటీ మేయర్ ఆళ్ళ చెల్లారవు, వైస్సార్సీపి నాయకులు నరసింహారావు, అబ్దుల్ కలాం, అక్కిరయ్య, సుబ్రహ్మణ్యం, రాజు, దుర్గారావు, నాగరాజు పాల్గొన్నారు.

దేవినేని నెహ్రు ట్రస్ట్ ద్వారా టిఫిన్ బండి,బడ్డీకొట్టు వితరణ
తూర్పు నియోజకవర్గ పరిధిలోని 15వ డివిజన్ నందు గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా పర్యటించినప్పుడు రెండు నిరుపేద కుటుంబాలకు చెందిన మీరాబీ,పద్మ లకి ఉపాధి కొరకు తగు సహాయం చేయాలని స్థానిక వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ దేవినేని అవినాష్ దృష్టికి తీసుకురాగా మంగళవారం నాడు వారికి రూ.20,000/- విలువ చేసే ఒక టిఫిన్ బండిని,రూ.25,000/- విలువ చేసే ఒక బడ్డీ కొట్టును దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అందజేయడం జరిగింది.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *