Breaking News

పదవీ విరమణ చేయు ప్రభుత్వ ఉద్యోగి యొక్క పెన్షన్ ప్రతిపాదనలను 6 నెలలు ముందుగానే డిడిఓ లు పంపాలి : ప్రిన్సిపాల్ అకౌంటెంట్ జనరల్ సి. చంద్ర మౌళి సింగ్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
పదవి విరమణ చేయబోవు ప్రతి ప్రభుత్వ ఉద్యోగి వారి యొక్క పెన్షన్ ప్రతిపాదనలను 6 నెలలు ముందుగానే పంపించేలా డిడిఓలు చర్యలు చేపట్టాలని ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ సి. చంద్ర మౌళి సింగ్ తెలిపారు.

మంగళవారం స్థానిక కలెక్టరేట్ సమావేశం మందిరంలో పెన్షన్, జి పి ఎఫ్ అదాలత్ కార్యక్రమం ప్రిన్సిపాల్ అకౌంటెంట్ జనరల్ ఏజి మరియు డైరెక్టరేట్ ఆఫ్ ట్రెజరీ, ఏపీ వారు సంయుక్తంగా నిర్వహించిన కార్యక్రమంలో ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ మాట్లాడుతూ పదవీ విరమణ చేయబోవు ప్రభుత్వ ఉద్యోగుల యొక్క పెన్షన్ దరఖాస్తులను సకాలంలో పూర్తి వివరాలతో తమకు పంపాలని సంబంధిత డిడిఓ లకు సూచించారు. ఉద్యోగులకు సంబందించిన జిపిఎఫ్ నామినీ, మిస్సింగ్ క్రెడిట్స్ తదితర సమస్యలను త్వరితగతన పరిష్కరిష్కరించడం కోసం ఈ అదాలత్ ఉపయోగ పడుతుంది అని అన్నారు.

జిల్లాలో దాదాపు చాలా మంది ప్రభుత్వ ఉద్యోగులు వారి యొక్క నామినీ వివరాలు నమోదు చేసుకోని వారు ఉన్నారని, కావున ప్రభుత్వ ఉద్యోగులు భవిషత్తులో వారికి రావాల్సిన బెనెఫిట్లకు సంబందించి ఇబ్బందులు తలెత్తకుండా జి.పి.ఎఫ్ ఖాతాలకు ఉద్యోగి యొక్క నామినీ వివరాలను రికార్డు లలో తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని తెలిపారు.

డిప్యూటీ అకౌంటెంట్ జనరల్ శ్రీ బనొత్ రాకేశ్ నాయక్ మాట్లాడుతూ పెన్షనర్లకు సంబందించిన పూర్తి స్థాయిలో ఉన్న ప్రతిపాదనలను, గ్రీవెన్స్ లను 31 రోజుల లోపు పరిష్కరిస్తామని తెలిపారు. పెన్షనర్ల ప్రతిపాదనలను అకౌంటెంట్ జనరల్ కార్యాలయమునకు పంపించే ముందు పెన్షనర్ల యొక్క సంతకం మరియు ఫోన్ నెంబర్లు అన్ని సరిచూసుకొని దరఖాస్తులను పంపించాలని సూచించారు. ఫోన్ నంబర్ వలన పెన్షన్ ప్రతిపాదనలను సంబంధిత ఉద్యోగి ఆన్లైన్లో ఎప్పటికప్పుడు వారి దరఖాస్తు ఏ స్థాయిలో ఉందో తెలుసుకోవచ్చని తెలిపారు.

అనంతరం ప్రిన్సిపాల్ అకౌంటెంట్ జనరల్ చంద్రమౌళి సింగ్, డిప్యూటీ అకౌంటెంట్ జనరల్ శ్రీ బనొత్ రాకేశ్ నాయక్, సీనియర్ డిఏజి సాయి గాంధీతో కలిసి పదవీ విరమణ పొందిన 25 మంది ఉద్యోగులకు చెందిన పెన్షన్ మంజూరు పత్రాలను, ఫైనల్ జి పి ఎఫ్ మంజూరు పత్రాలను కొందరికి అందజేశారు. ఈ పెన్షన్, జి పి ఎఫ్ అదాలత్ లో సుమారు 50 దాకా అర్జీలు అందాయని, వాటిని త్వరిత గతిన పరిష్కరించేందుకు చర్యలు చేపడతామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో సీనియర్ డిఏజి సాయి గాంధీ, టి. విజయ్ కుమార్ సీనియర్ అకౌంటెంట్ ఆఫీసర్, తిరుపతి జిల్లా ట్రెజరీ అధికారి లక్ష్మీకర్ రెడ్డి, ఏటిఓ ప్రసాద్, డిడి వోలు, పెన్షన్ దారులు, జిపిఎఫ్ హోల్డర్స్, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అవుట్‌ఫాల్ డ్రెయిన్ల డీసిల్టింగ్ పనులను పరిశీలించిన కమిషనర్ ధ్యానచంద్ర

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర బుధవారం ఉదయం వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *