Breaking News

గడపగడపలో సంక్షేమం-అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు : దేవినేని అవినాష్

విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త :
వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రంలో ఉన్న ప్రతి గడపకు సంక్షేమాన్ని చేరువ చేస్తూ అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గారిదే అని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ కొనియాడారు. బుధవారం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా 15వ డివిజిన్,72 వ సచివాలయం పరిధిలోని సాయిరాం కట్ పీసెస్ రోడ్డు నందు నాయకులు, అధికారులు, వాలంటీర్లతో కలిసి ఇంటింటికి వెళ్లిన అవినాష్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, చేస్తున్న అభివృద్ధి గురుంచి వివరిస్తూ సంక్షేమ క్యాలెండర్ కరపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో ప్రతి పేదవాడి జీవితంలో వెలుగులు నిండి సంతోషం గా ఉన్నారని నాయకులకు ఘన స్వాగతం పలుకుతూ ప్రతి ఒక్కరూ కూడా తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు అని అన్నారు. ఈ సచివాలయం పరిధిలోని 6 రోడ్లు దాదాపు 2కోట్ల రూపాయలు వెచ్చించి పూర్తి చేయడం జరిగిందని అన్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో పూర్తిగా నిర్లక్ష్యానికి గురైన ఈ ప్రాంతాన్ని కాలనీ లకు ధీటుగా అభివృద్ధి చేశామని ఈ ప్రాంతపెద్దలు బయటకు వచ్చి కృతజ్ఞతలు తెలపడం చాలా సంతోషంగా ఉందని అన్నారు.ఏఒకవైపు ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధి మీద దృష్టి పెట్టీ మంచి చేస్తుంటే మరోపక్క ప్రతిపక్ష తెలుగుదేశం కుట్రలు కుతంత్రాలు చేస్తూ అసత్య ప్రచారాలు చేస్తుంది అని విమర్శించారు. మా ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి ఒక్క ఎమ్మెల్సీ స్థానం గెలిచి సంబరాలు చేసుకొంటున్నారని ఎద్దేవా చేశారు. అమ్ముడుపోయిన నాయకులు మీ వైపు ఉంటే ప్రజలు మా వైపు ఉన్నారని ఎన్నికలు ఎప్పుడు వచ్చిన వైసీపీ ఘన విజయం సాధించడం ఖాయమని అవినాష్ ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ,మాజీ డిప్యూటీ మేయర్ ఆళ్ళ చెల్లారవు, వైస్సార్సీపి నాయకులు కొండ మేస్త్రి,భుజంగరావు, వీరయ్య, పవన్, చిన్న, హరీషు, సూరి, విస్సు, నాగరాజు, నాగిరెడ్డి, ప్రసాద్, స్వామి పాల్గొన్నారు

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *