విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అమలు చేస్తున్న సంక్షేమ పథకాలలో మహిళలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ వారికి సామజిక ఆర్థిక భద్రత కల్పిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గారని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు. బుధవారం క్రీస్తురాజపురం స్కూల్ ఆవరణలో జరిగిన ఆసరా వారోత్సవాలు కార్యక్రమంలో అవినాష్ ముఖ్య అతిథిగా పాల్గొని 3,5 డివిజన్ లకు చెందిన 286 గ్రూపులకు మంజూరు అయిన 21 లక్షల 55 వేల రూపాయల చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ గతంలో ప్రతి ప్రభుత్వం కూడా మహిళలను కేవలం ఓటు బ్యాంకు గా చూసేవరని కానీ కుటుంబ,సమాజ నిర్మాణం లో కీలకపాత్ర పోషించే మహిళల కృషిని గుర్తించి ప్రతి పధకంలో కూడా నేరుగా వారి ఖాతాలలో జమ చేస్తూ వారికి తగు గుర్తింపు ఇచ్చారని అన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని సద్వినియోగం చేసుకొంటూ మహిళలు ఆర్థికంగా ఎదగాలని అవినాష్ ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ,3వ డివిజన్ కార్పొరేటర్ భీమిశెట్టి ప్రవల్లిక,5వ డివిజన్ కార్పొరేటర్ కలపాల అంబెడ్కర్,కో ఆప్షన్ మెంబెర్ ముసునూరి సుబ్బరావు మరియు డివిజన్ ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News