Breaking News

ఆదివాసీలను ఆదుకోండి… : వాబ యోగి

విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ గాంధీనగర్, ప్రెస్ క్లబ్ లో బుధవారం ఆదివాసీల సంక్షేమ పరిషత్ విలేకరుల సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా ఆదివాసి సంక్షేమ పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షులు వాబ యోగి మీడియాతో మాట్లాడుతూ AP అసెంబ్లీలో బోయ వాల్మీకులను ST జాబితాలో చేరుస్తూ తీర్మానాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలి కోరారు. అభివృద్ధి చెందిన గిరిజనేతర బోయ, వాల్మీకి మరియు శ్రీకాకుళం జిల్లాలో ఉన్న నకిలీ బెంతు ఒరియా కులాలను ST జాబితా లో కలపడం వలన నేటికీ ఉద్యోగ ఉపాధి లేకుండా ఆదివాసి విద్యార్థులు రోజు కూలి బాట పడుతున్నారు. 50 లక్షలు జనాభాతో కూడిన బోయ వాల్మీకి లను ST జాబితాలో చేరిస్తే ఆదివాసీలు తీవ్రంగా నష్టం పోతారు అని ఆవేదన వ్యక్తం చేసారు. ఆదివాసీల కోసం పొందు పరిచిన రాజ్యంగ హక్కులు ఆదివాసీ పంచకుండా అభివృద్ధి చెందిన కులాలకు దోచి పెడితే ఇప్పుడు ఇప్పుడే అభివృద్ధి బాట పడ్తున్న ఆదివాసీ లు అన్యాయంకి గురి అవుతారని అన్నారు. ఆదివాసీ ల కోసమే అన్ని చేస్తున్నాము అని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వము జీవో 3 రద్దు అయితే చట్టం చేయాలని ఎందుకు అసెంబ్లీ లో తీర్మానం చేసి కేంద్రనికి పంపలేదు అని ప్రశ్నించారు. ఆదివాసీ రిజర్వేషన్ తో గెలిచిన MLA లు అసెంబ్లీ లో ప్రశ్నించకుండా, తీర్మానం ని వ్యతిరేకించకుండ చప్పట్లు కొట్టడం సిగ్గు చేటు అని అన్నారు. త్వరలో ఆదివాన్ ఓట్లతో గెలుపొందిన ఎమ్మెల్యేలు ఇల్లులను ముట్టడిస్తామన్నారు. రాజ్యాంగం లో ఆర్టికల్ 342 ని నిర్వీర్యం చేస్తూ ప్రవేశం -పెట్టిన తీర్మానం రద్దు చేసే వరకు పోరాటం ఆగదు అని హెచ్చరించారు. ఆదివాసీ ప్రజా ప్రతినిధులకు ఏమాత్రం ఆదివాసీ జాతి మీద ప్రేమ ఉన్నా పార్టీలకు రాజీనామా చేసి ఆదివాసీ ఉద్యమాల్లో పాల్గొనాలని డిమాండ్ చేసారు. రాజీనామా చెయ్యని పక్షంలో రాబోయే తరాలలో జాతి ద్రోహులుగా మిగిలిపోతారు. మరి ఒకసారి ప్రజాప్రతినిధులు ఆలోచించుకోవాలన్నారు. ఈనెల 31 న తలపెట్టిన ఆదివాసీ మన్యం బంద్ కి పార్టీలకు అతీతంగా ఆదివాసీ లు, ఉద్యోగులు, విద్యార్థులు, రాజకీయ నాయకులు పాల్గొని విజయ వంతం చేయాలని కోరారు. కార్యక్రమం లో ఆదివాసీ సంక్షేమ పరిషత్ సభ్యులు జన్ని, నీలయ్య, కొత్తూరు. కిరణ్, పెద్దింటి ప్రకాష్, మధు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *