Breaking News

రాహుల్ పార్లమెంట్ సభ్యత్వం రద్దు ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు

-ప్రజా సంఘీభావ సభలో వక్తలు ఉద్ఘాటన

విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో బుధవారం ‘ప్రజా సంఘీభావ సభ’ కాంగ్రెస్ పార్టీ నిర్వహించింది. కార్యక్రమాన్ని పౌరస్పందన వేదిక నాయకులు కొలనుకొండ శివాజీ పర్యవేక్షించారు. కాంగ్రెస్ నేత రాహుల్ పార్లమెంట్ సభత్వం రద్దు ప్రజాస్వామిక వ్యవస్థకు మాయని మచ్చని పలువురు వక్తలు బిజెపిపై మండిపడ్డారు. మోడీ ఇంటిపేరు గలవారు దొంగలా అనే సాధారణ వ్యాఖ్యానాన్ని అడ్డం పెట్టుకుని బిజెపి కేంద్ర ప్రభుత్వం తన రాజకీయకక్షను తీర్చుకుందన్నారు. భారత్ జోడో యాత్రతో రాహుల్ ప్రజాదరణకు బిజెపికి చెమటలు పట్టాయన్నారు. ఒకతప్పుడు పరువునష్టం దావా కేసువేసి, ఆ వెంటనే త్వరితిగతిన విచారణ పూర్తిచేసి, శిక్షలు వేయటం రాజకీయకక్షపూరిత చర్యలో భామేనన్నారు. శిక్షలాధారంగా, సభ్యత్వం రద్దు, నివాసం ఖాళీ నోటీసులన్ని బిజెపి ప్రభుత్వ తొందరపాటు చర్యలని, ప్రశ్శించే గొంతులను, ప్రజాగొంతులను నొక్కే చర్యలో భాగమేనన్నారు. ఈ చర్యలను అత్యున్నత న్యాయస్థానంలోను, రానున్న ఎన్నికలలో ప్రజాతీర్పులోను తగిన బుద్ధి జరుగుతుందని వక్తలు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సభలో ఎపి కాంగ్రెస్ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు, సిపిఐ రాష్ట్ర నాయకులు అక్కినేని వనజ, దోనేపూడి శంకర్, సిపియం నగర నాయకులు దోనేపూడి కాశీనాధ్, పురప్రముఖులు గోళ్ల నారాయణ రావు, బూర్తి నగేష్, మూళ్లపూడి నాగేశ్వరరావు, చంద్రశేఖర్, గంగిశెట్టి అయ్యప్ప, అల్లం రాజేష్, మరీదు ప్రసాద్ బాబు తదితరులు ప్రసంగించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *