-సిడిపివో జి మంగమ్మ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎన్‌టిఆర్ జిల్లా పరిధిలోని విజయవాడ ఐసిడిఎస్ ప్రాజెక్టు-2 పరిధిలోని అంగన్‌వాడీ కేంద్రాలలో అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయా పోస్టులు, మిని అంగన్‌వాడీ కార్యకర్త పోస్టుల భర్తీకి దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు సిడిపివో జి. మంగమ్మ ప్రకటనలో తెలిపారు. విజయవాడ ప్రాజెక్టు -2 పరిధిలోని 11వ డివిజన్ జార్జిపేట నందు అంగన్‌వాడీ కార్యకర్త ఒసి కేటగిరిలో రెండవ డివిజన్ మచవరం -1 నందు ఎస్సీ కేటగిరిలో 14వ డివిజన్ శ్రీనివాస్ నందు ఓసి కేటగిరిలో, 16వ డివిజన్ మధురానగర్ బిసి -డి కేటగిరిలో, 17వ డివిజన్ ద్వారకానగర్ నందు ఎస్టీ కేటగిరిలో, రాణిగారి తోట-2 నందు ఓసి కేటగిరిలో 22వ డివిజన్ డ్రైవర్ పేట-2 నందు బిసి`బి కేటగిరిలో, గొల్లపూడి, రామవరప్పాడు నందు ఓసి కేటగిరిలో అంగన్‌వాడీ సహాయకరాలు పోస్టులను, ప్రసాదంపాడు -8 నందు మిని అంగన్‌వాడీ కార్యకర్తల పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం అనుమతి మంజూరు చేయడం జరిగిందన్నారు. అంగన్‌వాడీ కేంద్రాలలో పైన తెలిపిన అంగన్‌వాడీ కార్యకర్త, మిని అంగన్‌వాడీ పోస్టులకు 21 సంవత్సరాలు నుండి 35 సంవత్సరాలలోపు వయస్సు కలిగి 10వ తరగతి ఉత్తీర్ణుం పొందిన స్థానికంగా వివాహిత రాలై ఉండాలన్నారు. అర్హత గల అభ్యర్థులు, అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయా పోస్టులకు, మిని అంగన్‌వాడీ కార్యకర్త పోస్టుల కొరకు ఎస్సీ ఎస్టీ బిసి కులదృవీకరణ పత్రాలు, నివాస దృవీకరణ పత్రాలు, ఆధార్, రేషన్‌కార్డులను ధరఖాస్తు ఫారంతో జత చేసి ఏప్రిల్ 4వ తేది సాయంత్రం 5 గంటల లోపు పెనమలూరు మండలం కానూరు నందుగల సిడిపివో కార్యాలయం వ్యక్తిగతంగా అందజేయాలని సిపిడివో మంగమ్మ ఆ ప్రకటనలో తెలిపారు.
Prajavartha Online Telugu News