విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో జాతీయ రహదారుల విస్తరణ, రైల్వే ప్రాజక్టులకు సంబంధించి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్. నూపుర్ అజయ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. విజయవాడ`గుండుగొలను జాతీయ రహదారి బెంజ్‌సర్కిల్ ప్ల్రైఓవర్ సర్వీస్‌రోడ్డు, రైల్వే ప్రాజెక్టు తదితర నిర్మాణ పనుల ప్రగతిని శనివారం జాయింట్ కలెక్టర్ ఎస్ నూపూర్ అజయ్ నగరంలోని కలెక్టరేట్ పింగళివెంకయ్య సమావేశ మందిరంలో రెవెన్యూ, జాతీయ రహదారుల శాఖల అధికారులతో జాయింట్ కలెక్టర్ నుపూర్ అజయ్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో విజయవాడ `గుండుగొలను జాతీయ రహదారి ఎన్‌హెచ్`5 విస్తరణలో భాగంగా సేకరించిన భూములకు సంబంధించి సంబంధిత భూ యజమానులకు నష్టపరిహారాన్ని త్వరితగతిన పంపిణీ చేయాలని విజయవాడ సబ్ కలెక్టర్‌ను ఆదేశించారు. ఎన్‌హెచ్`16 జాతీయ రహదారిలో బెంజ్‌సర్కిల్ ప్లైఓవర్‌కు ఇరువైపుల సర్వీస్‌రోడ్డు విస్తరణకు సంబంధించి భూసేకరణ, నష్టపరిహరపు చెల్లింపులు, తదితర పనులు వేగవంతం చేయాలన్నారు. దీనిలో భాగంగా బెంజ్‌సర్కిల్ పశ్చిమ వైపు సర్వీస్ రోడ్డుకు సంబంధించి గెజిట్‌లో త్రీడిని ప్రచురించాలని ఎన్‌హెచ్‌ఐ అధికారులను ఆదేశించారు. కాజిపేట, కొండపల్లి రైల్వే స్టేషన్ల మధ్య డబ్లింగ్, విద్యుదీకరణలో భాగంగా గుణదల వద్ద పనులకు మార్కెట్ వాల్యూ ప్రతిపాదనలను రూపొందించాలని విజయవాడ సబ్ కలెక్టర్‌ను ఆదేశించారు. ముస్తాబాద్ రాయనపాడు రైల్వే స్టేషన్ల మధ్య రైల్వే ఫ్లై ఓవర్ (ఆర్‌ఓఆర్) పనులకు గొల్లపూడి, జక్కంపూడి గ్రామాలలో భూయజమానుల అభ్యంతరాలపై రిమార్కులను త్వరితగతిన సమర్పించాలని రెవెన్యూ అధికారలును జాయింట్ కలెక్టర్ నుపూర్ అజయ్ ఆదేశించారు. సమావేశంలో డిఆర్‌వో కె. మోహన్ కుమార్, సబ్ కలెక్టర్ అతిది సింగ్, తిరువూరు, నందిగామ ఆర్‌డివోలు వై వి.ప్రసన్నలక్ష్మి, ఏ రవీంద్రరావు, భూసేకరణ విభాగ సూపరింటెండెంట్ దుర్గాప్రసాద్, కలెక్టరేట్ డిప్యూటి తహాశీల్థార్ రాజేష్, నేషనల్ హైవేస్ అధికారులు, ఆర్‌అండ్‌బి ఇఇలు, ఆయా మండల తహాశీల్థార్లు ఉన్నారు.
Prajavartha Online Telugu News