Breaking News

జిల్లాల విభజనతో ప్రజలకు అందుబాటులో పాలనావ్యవస్థ.

-ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ………
-వివిధ ప్రభుత్వ సంక్షేమ పథకాలతో రూ.2378 కోట్లు జిల్లాలోని లబ్దిదారుల బ్యాంకు ఖాతాలకు జమ.
-గత ఏడాది పారిశ్రామిక పెట్టుబడులు రూ.5409 కోట్లు, 15696 మందికి ఉద్యోగాల కల్పన.
-ఈ నెల 15 న 15 వేల గృహాలు ప్రారంభించడానికి సన్నాహాలు: జిల్లా కలెక్టర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
గత సంవత్సరం ఏప్రిల్ 4 న జిల్లాల పునర్విభజనతో తిరుపతి జిల్లా కలియుగదైవం శ్రీ వేంకటేశ్వరుని పాదాల చెంత ఏర్పడటం, స్వామివారి ఆశీస్సులతో తిరుపతి జిల్లా సంక్షేమ పథకాల అమలులో, అభివృద్ధిలో అందరి సహకారంతో సమర్థవంతంగా ముందుకువెలుతున్నామని జిల్లా కలెక్టర్ కె.వెంకటరమణా రెడ్డి తెలిపారు. జిల్లా ఏర్పడి ఈనెల 4 నాటికి ఏడాది పూర్తి కావడం సంతోషంగా ఉందని…….
మీడియా ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ ……….

సంక్షేమ పథకాలు: దాదాపు 27 సంక్షేమ పథకాలకు పైగా వై.ఎస్.ఆర్ రైతు భరోసా, జగనన్న అమ్మ ఒడి, వై.ఎస్.ఆర్. పెన్షన్ కానుక, వై.ఎస్.ఆర్. వాహన మిత్ర ఇలా ఎన్నో పథకాల ద్వారా జిల్లాలో 24,42,699 మంది లబ్దిదారులకు ఈ ఏడాది రూ.2378 కోట్లు నేరుగా వారి బ్యాంకు ఖాతాలకు జమ అయిందని, పథకాల సద్వినియోగంతో అనేక మంది మహిళలు ఆర్ధిక స్వావలంబన సాధించడం, బ్యాంకు రుణాలను 98 శాతం తిరిగి చెల్లింల్లో జిల్లా వుండటం సంతోషంగా వుంది.

నవరత్నాలు – పేదలందరికీ ఇళ్ళు : పేదల సొంతింటి కల సాకారం అవుతోంది, జిల్లాలో మొదటి విడత లో 73,723 మహిళా లబ్దిదారులకు గృహాలు మంజూరు కాగా, తిరుపతి జిల్లా ఏర్పడ్డ నాటికి 700 గృహాలు మాత్రమే పూర్తి అయ్యాయని, ఈ నెల 15 నాటికి 15000 గృహాలు సామూహిక గృహ ప్రవేశాలను ప్రారంభించడానికి కృషి జరుగుతోంది, తిరుపతి నగర లబ్దిదారులు 20 వేలకు పైగా ఉండటం, లబ్దిదారులు కేటగిరి -3 ఎంపిక చేసుకోవడంతో తప్పనిసరి కాంట్రాక్టర్లు నిర్మించాల్సి ఉన్నందున ఆలస్యానికి కారణం, అయినా రాష్ట్రంలో తిరుపతి జిల్లా గృహ నిర్మాణాలలో 5 వ స్థానంలో ఉంది.

పారిశ్రామిక అభివృద్ధి: జిల్లాలో పరిశ్రమల స్థాపనకు జిల్లాలో అనుకూల వాతావరణం, వసతులు ఉంది. జాతీయ రాష్ట్ర రహదారులతో పాటు అంతర్జాతీయ విమానాశ్రయాలు చెన్నై, బెంగళూరు, తిరుపతి, సీ- పోర్టులు వంటి రవాణా సౌకర్యాలు ఉండటం, ఎ.పి.ఐ.ఐ.సి. భూములు అందుబాటులో ఉండటం, విసిఐసి కారిడార్ భూసేకరణ తో పారిశ్రామికంగా జిల్లా అభివృద్ధికి దోహదపడుతుంది. గత ఏడాది జిల్లా ఏర్పడిన నాటి నుండి నేటి వరకు 15 పెద్ద పరిశ్రమలు పారిశ్రామిక పెట్టుబడులు రూ.5409 కోట్లతో 1835 మధ్య తరహా చిన్న పరిశ్రమలు ప్రారంభమై 15696 మందికి ఉద్యోగాల కల్పన జరిగింది. రానున్న ఏడాది మరో 14 పెద్ద పరిశ్రమలు రూ.12,357 కోట్ల పెట్టుబడితో నిర్మాణాలు సాగుతున్నాయి, ప్రారంభానికి పలు పరిశ్రమలు సిద్ధం అవుతున్నాయి. దీనివలన మరో 21,626 మందికి ఈ ఏడాది పరిశ్రమల్లో ఉపాధి , ఉద్యోగ అవకాశాలు కలగనున్నాయి.

వై.ఎస్.ఆర్. జగనన్న శాశ్వత భూ హక్కు- భూ రక్ష: దాదాపు 100 సంవత్సరాల తరువాత ప్రతిష్టాత్మకంగా జిల్లాలో మొదటి విడత 69 గ్రామాలలో రీ సర్వే పూర్తి చేసి సచివాలయ స్థాయిలోనే రిజిస్ట్రేషన్ల ప్రక్రియకు నాంది పలికాం. రెండవ విడతలో 208 గ్రామాలలో ప్రారంభించి ఏప్రిల్ ఆఖరు నాటికి రీ సర్వే పూర్తి చేయనున్నాం. ఇందువల్ల రెవిన్యూ సమస్యలకు పూర్తి పరిష్కారం జరుగుతున్నది.

స్పందన : రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాతమకంగా చేపడుతున్న స్పందన కార్యక్రమం సామాన్య ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రతి సోమవారం జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించి స్పందన కార్యక్రమంలో ఇప్పటి వరకు 12,422 వినతులను అందాయి. అందులో 563 మాత్రమే వివిధ దశలలో పరిశీలనలో ఉన్నాయి. వీటిని కూడా నిర్ణీత సమయంలోగా పూర్తి స్థాయిలో పరిష్కరిస్తాం. ప్రతి అర్జీ జవాబుదారీ తనంతో, అర్థవంతంతో అర్జీదారుడు సంతృప్తి చెందేలా చర్యలు తీసుకుంటున్నాం. అలాగే స్పందన ఆర్జీలను ప్రభుత్వ పనిదినాలలో సాయంత్రం 3 గంటల నుండి 5 గంటల వరకు సచివాలయాలలో స్వీకరించే విధంగా ఏర్పాటు ఉంది.

గ్రామ సచివాలయాలు: జిల్లాలో 691 గ్రామ/వార్డు సచివాలయ వ్యవస్థ ఏర్పాటుతో ప్రజలకు స్థానికంగానే పౌర సేవలు అందుతున్నాయి.

రైతు భరోసా కేంద్రాలు: జిల్లాలో 445 రైతుల భరోసా కేంద్రాల ద్వారా ప్రభుత్వం దృవీకరించిన విత్తనాలు, ఎరువులు రాయితీ కల్పించి డిజిటల్ కియోస్క్ ల ఏర్పాటుతో రైతులకు అనుభవజ్ఞులైన శాస్త్రవేత్తలతో శిక్షణ ఇవ్వడం, విత్తు నుండి విక్రయం దాకా రైతుకు అందుబాటులో తీసుకువచ్చాం.

వై.ఎస్.ఆర్ యంత్ర సేవ పథకం : రైతులకు దాదాపు 308 ఆర్.బి.కె ల పరిధిలో కస్టమర్ హైరింగ్ సెంటర్లు ఏర్పాటు చేసి వ్యవసాయ యాంత్రిక పరికరాలు, ట్రాక్టర్లు, ఇతర వ్యవసాయ పరికరాలు వంటివి రైతులకు అందుబాటులోకి తెచ్చాం.

పేద విద్యార్థులకు ఉచిత ప్రైవేటు కార్పోరేట్ విద్య : ఆర్థికంగా వెనుకబడిన పేద కుంటుంబాల విద్యార్థులకు ప్రైవేట్ అన్ ఎయిడెడ్ విద్యాసంస్థల్లో, 2023-24 విద్యా సంవత్సరం 1వ తరగతిలో అడ్మిషన్ కొరకు ఏప్రిల్ 1వ తేదీ నాటికి 5 సంవత్సరాలు వయస్సు పూర్తి అయిన పిల్లల వివరాలతో ఏప్రిల్ 10 వ తేదీ లోపు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని, దరఖాస్తు ఉచితంగా సంచివాలయల నుండే చేసుకునే వీలు కల్పించాం, ఈ ఏడాది జిల్లాలో 423 ప్రైవేట్ , అన్ ఎయిడెడ్ పాఠశాలల్లో 4230 మందికి 1 వ తరగతిలో అడ్మిషన్ కు అవకాశం కల్పిస్తున్నాం.

స్కిల్ డెవలప్ మెంట్: స్కిల్ డెవలప్ మెంట్ యూనివర్సిటీ ఏర్పాటుకు ఏర్పేడు మండలం కోబాక వద్ద 50 ఎకరాల భూకేటాయింపు, స్కిల్ కాలేజ్ చంద్రగిరి నియోజకవర్గం నాగపట్ల వద్ద 9.8 ఎకరాల భూకేటాయింపు జరిగింది. ప్రతి నియోజకవర్గంలో ఒక స్కిల్ హబ్స్ ఏర్పాటులో భాగంగా జిల్లాలో 8 హబ్ లలో యువతకు శిక్షణ ఇస్తున్నాం. స్కిల్ డెవలప్మెంట్ ద్వారా యువతకు శిక్షణ, ఉపాధి, ఉద్యోగ అవకాశాల కల్పన జరుగుతున్నది. పరిశ్రమల అనుసంధానంతో పరిశ్రమలకు కావల్సిన విధంగా ఆ రంగంలో శిక్షణను ఇచ్చి యువతకు అండగా నిలుస్తున్నది.

‘మండూస్ తుఫాన్’ (గత డిసెంబర్ 9 నుండి 11 వరకు) సమర్థవంతంగా ముందస్తు ప్రణాళికతో ఎదుర్కున్నాం, 554 మందికి పంట నష్ట పరిహారం అందించాం. వివిధ శాఖలకు సంబందిoచి దెబ్బతిన్న రోడ్లు, గట్లు వంటి 246 పనులకు గాను ఎఫ్.డి.ఆర్. నిధులకోసం ప్రతిపాదనలు పంపాం. గత మాసం మార్చి లో అకాల వర్షాలతో 86 గ్రామాలలో 1398 హెక్టర్లలో వరి, 60 హెక్టార్లలో వేరుశనగ పంటలు దెబ్బతిన్న అంచనాలను పరిహారం కొరకు ప్రభుత్వానికి నివేదిక పంపాం.

గడప గడపకు మన ప్రభుత్వం: ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రతి గడపకు వెళ్లి ప్రజా సమస్యలు పరిష్కారానికి శ్రీకారం చుట్టి అందిన వినతులలో ప్రాధాన్యత మేరకు పనులకు శ్రీకారం చుట్టి రూ.53 కోట్లు నిధులు మంజూరు చేసి 1557 పనులు చేపట్టి అందులో 1420 ఇప్పటికే పూర్తి చేసాం.

రానున్న వేసవిలో త్రాగు నీటికి ఇబ్బందులు లేదు, అధికంగా ఎండల నమోదు, వడగాల్పులు హెచ్చరికల నేపథ్యంలో ఇప్పటికే అధికారులను అప్రమత్తం చేశాం, చలివేంద్రాల ఏర్పాటు, పశువులకు నీటి తోట్టెలు ఏర్పాటు, ప్రధాన కూడళ్ళలో చలువ పందిళ్ళు, అన్ని ఆరోగ్య కేంద్రాలలో, సచివాలయ స్థాయి హెల్త్ క్లినిక్ లలో అవసరమైన ఓ.ఆర్.ఎస్. ప్యాకెట్లు, మందులు అందుబాటులో ఉంచాం.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అవుట్‌ఫాల్ డ్రెయిన్ల డీసిల్టింగ్ పనులను పరిశీలించిన కమిషనర్ ధ్యానచంద్ర

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర బుధవారం ఉదయం వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *