తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
స్పందన కార్యక్రమంలో వచ్చిన అర్జీలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణీత కాల వ్యవధి లోపల ప్రజలు అందజేసిన సమస్యల అర్జీలకు అర్థవంతo గా పరిష్కారం చూపాలని డి ఆర్ ఓ శ్రీనివాస రావు అధికారులను ఆదేశించారు. సోమవారం ఉదయం కలెక్టరేట్ లో నిర్వహించిన స్పందన కార్యక్రమoలో డి ఆర్ ఓ శ్రీనివాసరావు, ఎస్ డి సి లు కోదండ రామిరెడ్డి, భాస్కర్ నాయుడు, శ్రీనివాసులు జిల్లాలో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారుల నుండి వినతులను స్వీకరించి స్పందన ఆన్ లైన్ నమోదుతో రసీదులు అందించారు. రెవెన్యూ శాఖకు- 80, మైన్స్ అండ్ జియాలజి అసిస్టెంట్ డైరెక్టర్ 2, పోలీస్ శాఖ 11, పి.డి హౌసింగ్ 2, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ 2, డి.ఆర్.డి.ఏ -1, మునిసిపల్ కమిషనర్-3, డిసెబిల్డ్ వెల్ఫేర్ 2, జిల్లా ట్రెజరీ కార్యాలయం 2, డి.ఎం&హెచ్ ఓ -2, లేబర్ డిపార్ట్ మెంట్-2, డి.ఎస్. ఓ – 1, డి.పి. ఓ-1, ఆర్&బి -1, పి.డి డ్వామా-1, సబ్ రిజిస్ట్రారు-2 , ఎస్.ఈ ఇరిగేషన్ – 3, జిల్లా సైనిక్ ఆఫీసర్ -1 , డి.ఈ. ఓ- 3, ఎస్.ఈ.పి.ఆర్ – 1 కలిపి మొత్తం 123 వినతులు రావడం జరిగిందని జిల్లా అధికారులు వచ్చిన అర్జీలను సకాలంలో పరిష్కరించాల్సిందిగా స్పందనకు హాజరయిన వివిధ శాఖలకు సంబందించిన జిల్లా అధికారులను డి ఆర్ ఓ శ్రీనివాసరావు ఆదేశించారు.
Prajavartha Online Telugu News