-రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు
-63 వ డివిజన్ 278 వ వార్డు సచివాలయ పరిధిలో నాలుగో రోజు గడప గడపకు మన ప్రభుత్వం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మూడున్నరేళ్ల పాలన పేదలలో కొండంత ధైర్యాన్ని నింపిందని ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. సోమవారం 63 వ డివిజన్ 278 వ వార్డు సచివాలయ పరిధిలో నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డి, స్థానిక కార్పొరేటర్ మోదుగుల తిరుపతమ్మతో కలిసి ఆయన పాల్గొన్నారు. పాత రాజీవ్ నగర్లో విస్తృతంగా పర్యటించి.. 250 గడపలను సందర్శించారు. దుకాణదారులు, పండ్లు, కూరగాయల వ్యాపారులు.. ఇలా అన్ని వర్గాల ప్రజలతో మమేకమై పాదయాత్ర కొనసాగించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి పనులపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ.. వారి నుండి సలహాలు, అర్జీలు స్వీకరించారు. ఇంకా ఎవరికైనా సంక్షేమ పథకాలు అందకపోతే అడిగి తెలుసుకుని పరిష్కరించాలని సంబంధిత అధికారులకు సూచించారు. కొత్తగా వచ్చిన వారికి మ్యాపింగ్ ప్రక్రియ త్వరగా పూర్తిచేయాలని వాలంటీర్లకు సూచించారు.
రికార్డు స్థాయికి సామాజిక పింఛన్లు
సామాజిక భద్రత పెన్షన్లు అందించడంలో దేశంలో ఏ రాష్ట్రం కూడా ఆంధ్రప్రదేశ్ కు ధీటుగా రాలేదని మల్లాది విష్ణు అన్నారు. చంద్రబాబు పాలనలో ఎన్నికల ముందు వరకు కేవలం రూ.వెయ్యి మాత్రమే పింఛన్ ఇచ్చే వారని గుర్తుచేశారు. కానీ నేడు ఒక్కొక్కరికీ రూ.2,750 చొప్పున అందిస్తుండటంతో అవ్వాతాతల మోముల్లో ఆనందం వెల్లివిరుస్తోందని చెప్పారు. అలాగే పింఛన్ అర్హతను 65 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు తగ్గించిన ఘనత సీఎం జగన్ కే దక్కుతుందన్నారు. పైగా ఏడాదికి రెండుసార్లు జూలై మరియు జనవరి మాసాలలో నూతన పింఛన్లను మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. గత టీడీపీ ప్రభుత్వం రాష్ట్రంలో కేవలం 39 లక్షల మందికి మాత్రమే పెన్షన్లను ఇచ్చిందని.. కానీ ఈ ప్రభుత్వంలో 63.66 లక్షల మందికి అందిస్తున్నట్లు వెల్లడించారు. ఇందుకోసం నెలకు రూ. 1,754 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం వెచ్చిస్తోందని తెలిపారు. ఒక్క సెంట్రల్ నియోజకవర్గంలోనే 26,418 మందికి ప్రతినెలా రూ. 7 కోట్ల 18 లక్షల 24 వేల 500 పింఛన్ రూపంలో అందిస్తున్నట్లు మల్లాది విష్ణు తెలియజేశారు. తెలుగుదేశం హయాంలో పది రోజులు పడిగాపులు కాస్తే తప్ప పింఛన్ డబ్బులు చేతికి అందేవి కాదని.. కానీ ఈ ప్రభుత్వంలో డోర్ డెలివరీ చేస్తుండటంతో అవ్వాతాతలకు వ్యయప్రయాసాలు తప్పాయని చెప్పారు.
‘వై నాట్ 175’ ను భగ్నం చేసే కుట్ర
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంపై వైఎస్సార్ సీపీ శాసనసభ్యులందరూ పూర్తి విశ్వాసం, నమ్మకంతో ఉన్నారని ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు అన్నారు. తమ బాటలోనే మిగతా ఎమ్మెల్యేలు ఉన్నారంటూ ఆనం రామనారాయణరెడ్డి చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. ‘వై నాట్ 175’ భగ్నం చేసే టీడీపీ కుట్రలో భాగంగా ఇటువంటి గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అలాగే టీడీపీ నేత నారాలోకేష్ నోరు అదుపులో పెట్టుకోవాలని మల్లాది విష్ణు సూచించారు. ప్రజలంతా జగనన్న పాలన శభాష్ అంటూ కీర్తిస్తుంటే.. చూసి ఓర్వలేనితనంతో పచ్చ నేతలు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ధైర్యముంటే పంచాయతీ రాజ్ మంత్రిగా సాధించిన ప్రగతి, ఇచ్చిన పింఛన్లపై లోకేష్ శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అంతేగాని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి నోటికొచ్చినట్లు మాట్లాడితే.. ప్రజలు చూస్తూ ఊరుకోరని మరోసారి తగిన రీతిలో బుద్ధి చెప్పడం ఖాయమని హెచ్చరించారు. అలాగే సచివాలయ కన్వీనర్లు, గృహ సారథులు ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లి, వారితో మమేకం కావాలని మల్లాది విష్ణు సూచించారు. జగనన్న సర్కారుపై అన్ని వర్గాల ప్రజలు పూర్తి సానుకూల ధోరణితో ఉన్నారని.. ఈ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రతీ గడపకూ వెళ్లి వివరించాలని తెలియజేశారు. ప్రభుత్వంపై ప్రతిపక్షాలు, ఎల్లో మీడియా కలిసి చేస్తున్న కుట్రలను ఎప్పటికప్పుడు తిప్పికొడుతూ.. ‘జగనన్నే మా భవిష్యత్’ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో డీఈలు గురునాథం, రామకృష్ణ, ఏఈ అరుణ్ కుమార్, సీడీఓ జగదీశ్వరి, డివిజన్ కోఆర్డినేటర్ పసుపులేటి యేసు, నాయకులు సీహెచ్ రవి, మోదుగుల గణేష్, టెక్యం కృష్ణ, నాగేశ్వరరావు, తిరుపతిరావు, ఎం.గోపి, అన్ని శాఖల అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News