Breaking News

ఘనంగా శారద కళాశాల స్వర్ణోత్సవ వేడుకలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగరంలోని గాంధీ నగర్ లో గల శారద కళాశాల 50 వసంతాలకు చేరుకున్న సందర్భంగా జరిగిన స్వర్ణోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో భాగంగా, స్వర్ణోత్సవ లోగోను కంచి కామకోటి పీఠం,70వ జగద్గురువులు,శ్రీశ్రీశ్రీ విజయేంద్ర సరస్వతి స్వామి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు తమ అమూల్యమైన సందేశాన్ని అందించారు.ఈ కార్యక్రమంలో శారదా ఎడ్యుకేషనల్ సొసైటీ సెక్రటరీ కుందా సీతారామశాస్త్రి, కుందా రామనారాయణ, కరస్పాండెంట్ వరప్రసాద్, శారదా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ నాగేశ్వర శర్మ, శారదా జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ లుక్కా. శ్రీధర్, శారదా స్కూల్ (E.M) ప్రిన్సిపల్ నరసింహ మూర్తి తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *