విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ గారి 116వ జయంతి వేడుకలు విజయవాడ జనసేన పార్టీ పశ్చిమ నియోజకవర్గ కార్యాలయంలో జనసేన పార్టీ విజయవాడ నగర అధ్యక్షులు రాష్ట్ర అధికార ప్రతినిధి మరియు పశ్చిమ నియోజకవర్గం ఇంచార్జ్ పోతిన వెంకట మహేష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ … అట్టడుగు వర్గాల అభ్యున్నతి, అణగారిన ప్రజల సమాన హక్కుల కోసం బాబు జగ్జీవన్ రామ్ చేసిన పోరాటం మరువలేనిదన్నారు. స్వాతంత్య్ర సమరయోధుడిగా, ఉపప్రధానిగా దేశసేవకు అంకితమైన ఆయన జీవితం స్ఫూర్తిదాయకం అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బంగారు నూకరాజు, సోనీ గోవింద, కొరగంజీ వెంకటరమణ, పొట్నూరి శ్రీనివాసరావు, గంజి పవన్, బుట్టా సాయికుమార్, పులి చేరి రమేష్, భార్గవి, తదితరులు పాల్గొన్నారు
Prajavartha Online Telugu News