Breaking News

ఘనంగా బాబూజగ్జీవన్‌రామ్‌ జయంతి

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
మేడికొండూరు మండలం డోకిపర్రు పంచాయతీలోని శాంతిపాలెంలో బుధవారం బాబూ జగ్జీవన్‌రామ్‌ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ మైనార్టీ విభాగం నేషనల్‌ వైస్‌ చైర్మన్‌ జమీల్‌ అహ్మద్‌ బేగ్‌ పాల్గొని బాబూ జగ్గీవన్‌రామ్‌ విగ్రహానికి పూలమాలవేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాబూజీగా ప్రసిద్ధి చెందిన జగ్జీవన్‌రామ్‌ అంటరాని వారి శ్రేయస్సు కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహామనిషి దళితజన బాంధవుడు. సామాజిక సమానత్వంపై అందరినీ చైతన్యపరిచేందుకు నిరంతరం శ్రమించారు. హరిత విప్లవాన్ని విజయవంతం చేయడంలో బాబూజగ్జీవన్‌రామ్‌ కీలకపాత్ర పోషించారని, కార్మిక మంత్రిగా పలు సంస్కరణలు చేశారని జమీల్‌ అహ్మద్‌ బేగ్‌ తెలిపారు. ఈ కార్యక్రమంలో డోకిపర్రు సర్పంచ్‌ కె. చిన కోటేశ్వరరావు, ఎంపిటిసి సభ్యులు కె. మహాలక్ష్మయ్య, ఎమ్మార్పీఎస్‌ నాయకులు ఆర్‌.శ్రీనుకృష్ణ, ఆర్‌.వెంకటేశ్వర్లు, ఆర్‌. చంద్రరావు, జి. చిట్టెమ్మ, డి. అన్నమ్మ, ఆర్‌.కిరణ్‌, షేక్‌ సుబాని, బి. సైదులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *