విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రస్తుతం బిజెపి పాలనలో దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిరదని, మహాత్మా గాంధీ కలలు కన్న స్వరాజ్యం భారతదేశంలో రావాలని గాంధీ దేశం సోషల్ వెల్ఫేర్ ట్రస్ట్ అధ్యక్షులు గాంధీ నాగరాజన్ ఆందోళన వ్యక్తం చేశారు. బుధవారం గాంధీనగర్‌లోని ధర్నాచౌక్‌లో గాంధీ దేశం సోషల్ వెల్ఫేర్ ట్రస్ట్ అధ్యక్షులు గాంధీ నాగరాజన్ సత్యాగ్రహ నిరాహార దీక్ష చేశారు. ఈ సందర్భంగా గాంధీ నాగరాజన్ మాట్లాడుతూ బ్రతికితే దేశం కోసం, చస్తే దేశం కోసం అనే నినాదంతో తాను ఉద్యమ బాట నడుస్తున్నానన్నారు. ప్రధాని మోడీ పరిపాలనను బ్లాక్‌డేగా గుర్తించాలని, ప్రధాని మోడీ ప్రజాస్వామ్యాన్ని రక్షించాలంటే రాజీనామా చేయాలన్నారు. మతాలకు అతీతంగా ఐకమత్యంగా జీవించాలి. అలాంటి ప్రజా నాయకుడు మనకు కావాలి…రావాలి…అందుకే ఈ నిరసన దీక్ష అని తెలిపారు. రాష్ట్రానికి ప్రత్యేకహోదా, చట్టసభల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్లు వున్ననాడే మనరాష్ట్రం, భారతదేశం అభివృద్దిచెందుతాయని, మహాత్మా గాంధీ, అంబేద్కర్ ఆశయాలను సాధించేందుకు పాలకులు నిస్వార్ధంగా పనిచేయాలని కోరారు. ఓటును నోటుకు అమ్ముకునే సంస్కృతిని విడనాడి. ఓటు అనే బ్రహ్మాస్త్రంతో మంచి నాయకుడిని ఎన్నుకుందామన్నారు. రాహుల్ గాంధీ పార్లమెంటు సభ్యత్వాన్ని ప్రధాని మోడీ, బిజెపి పాలకులు ఎంతో అప్రజాస్వామ్యంగా తొలగించారన్నారు. ఈ సత్యాగ్రహ నిరాహార దీక్షకు అన్ని పార్టీల వారిని ఆహ్వానించామని కాంగ్రెస్, సీపీఐ, తదితర పార్టీల నాయకులు, ప్రజాస్వామ్యవాదులు రాజకీయాలకు అతీతంగా వచ్చి తమ సంఫీుభావాన్ని తెలిపారన్నారు. వారందరికీ పేరుపేరున ధన్యవాదాలు తెలిపారు. వెంటనే రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్యత్వాన్ని పునరుద్ధరించాలని గాంధీ నాగరాజన్ డిమాండ్ చేశారు. గతంలో ఇందిరా గాంధీ హయాంలో విధించిన ఎమర్జెన్సీని సైతం ఆయన తప్పు పట్టారు. ఇదే తరహాలో ప్రస్తుతం ప్రధాని మోడీ పాలనలో దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తుందని విమర్శించారు. ప్రధాని మోడీ విధానాలు ఆదానికి లబ్ధి చేకూర్చేలా ఉన్నాయి గాని భారతదేశ ప్రజాస్వామ్య పరిరక్షణకు ఏమాత్రం ఉపయోగపడటం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. దీనికి సమాధానం రాబోయే ఎన్నికలలో తెలియజేస్తారని అన్నారు. నాయీ ప్రశ్నించే గళం వల్ల నాకేదో సంకెళ్ళు పడతాయని భయపడో, చిప్పకూడుకు భయపడే వ్యక్తులు కాదు గాంధేయ వాదులన్నారు. ఇప్పుడు ప్రజలు మేల్కొనాలని ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్య పరిరక్షణని కాపాడుకోవాలని, మన భవిష్యత్తు తరాల కోసం అయినా అందరూ నడుం కట్టాలని పిలుపునిచ్చారు. రాహుల్ గాంధీ పార్లమెంటు సభ్యత్వాన్ని తిరిగి ఇచ్చేవరకు తన నిరసన గళాన్ని వివిధ రూపాల్లో తెలియజేస్తానని ఇప్పటికైనా మోడీ తన తప్పు తెలుసుకుని సరిదిద్దుకోవాలన్నారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు, పిసిసి కార్య నిర్వాహక అధ్యక్షులు సుంకర పద్మశ్రీ, విజయవాడ నగర కాంగ్రెస్ అధ్యక్షులు నరహరశెట్టి నరసింహారావు, సీపీఐ విజయవాడ నగర కార్యదర్శి జి.కోటేశ్వరరావు, తదితర పార్టీల నాయకులు శిబిరానికి హాజరై తమ సంఫీుభావాన్ని తెలిపారు. ఈ కార్యక్రమంలో గాంధీ ట్రస్ట్ మహిళా అధ్యక్షురాలు ఆర్.ఎన్. శివరంజని, ట్రస్టు రాష్ట్ర అధ్యక్షురాలు బాపతి భారతి తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News