Breaking News

డా.బాబు జగ్జీవన్‌రామ్‌ సేవలు చిరస్మరణీయం..

-జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, సంఘ సంస్కర్త, కీర్తిశేషులు డా. బాబు జగ్జీవన్‌ రామ్‌ దేశానికి అందించిన సేవలు చిరస్మరణీయమని జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు అన్నారు. డా. బాబు జగ్జీవన్‌ రామ్‌ 115వ జయంతి పురస్కరించుకుని స్థానిక రామవరప్పాడు రింగ్‌ సెంటర్‌ వద్ద బుధవారం జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు, శాసనసభ్యులు వెలంపల్లి శ్రీనివాసరావు, మల్లాది విష్ణువర్థన్‌, సాంఫీుక సంక్షేమ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ జి. జయలక్ష్మి, కమీషనర్‌ కె. హర్షవర్థన్‌, తదితరులు బాబు జగజ్జీవన్‌ రామ్‌ కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
అనంతరం జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ స్వాతంత్య్ర సమరయోదుడు గొప్ప సంఘ సంస్కర్త, రాజకీయ వ్యక్తగా జగ్జీవన్‌రామ్‌ దేశానికి అందించిన సేవలను నేటి తరం స్పూర్తిగా తీసుకోవాలన్నారు. భారత పార్లమెంట్‌లో 40 ఏళ్ళ పాటు మంత్రి పదవులు నిర్వహించడమే కాకుండా ఉపప్రధానిగా బడుగు బలహీన వర్గాల అభ్యున్నతకి ఎన్నలేని కృషి చేశారన్నారు. ఇండో`పాక్‌ యుద్దం సమయంలో జగజ్జీవన్‌ రామ్‌ దేశ రక్షణలో కీలక పాత్ర పోషించారన్నారు. హరిత విప్లవం ద్వారా వ్యవసాయాన్ని ఆధునికరించడంలో చేసిన కృషి కారణంగా ఆహార ధాన్యాల ఉత్పత్తిలో దేశం స్వయం సమృద్దికి దోహదపడిరదన్నారు. జగ్జీవన్‌ సేవలను స్పూర్తిగా తీసుకుని ఆయన అడుగుజాడల్లో పయనించి సమాజాభివృద్ధికి కృషి చేయాలన్నారు.
నగర మేయర్‌ రాయన భాగ్యలక్ష్మి, రాష్ట్ర ఎస్సీ కమీషన్‌ మెంబర్‌ కాలే పుల్లారావు, ఏపి ఫైబర్‌ నెట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ పి. గౌతమ్‌రెడ్డి, టిడ్కో నోడల్‌ ఆఫీసర్‌ కె. విజయకుమార్‌, మాదిగ కార్పొరేషన్‌ చైర్మన్‌ కనకారావు, జడ్పిటీసి సువర్ణరాజు, యంపిపి చెన్ను ప్రసన్న కుమారి, యంపిటిసి డి. రత్నం, గ్రామ సర్పంచ్‌ వి.శ్రీదేవి, సంఫీుక సంక్షేమ శాఖ పర్యవేక్షకులు నాంచారయ్య, సహాయ సంక్షేమ అధికారి. యు.వి కోటేశ్వరరావు, వసతి గృహ సంక్షేమ అధికారులు యం చంద్రమోహన్‌, సయ్యద్‌ కీర్మాని, పి.ఆదిలక్ష్మి, సరోజ గ్రేస్‌ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *