తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త :
బాబూజీ గా ప్రసిథ్థి పొందిన భారత ఉప ప్రథాని బాబూ జగ్జీవన్ రామ్ అణగారిన వర్గాల జీవాతాల ఉథ్థరణకు విశేషకృషిచేశారని ఆయన జీవితాన్ని నేటితరం స్పూర్తిగా తీసికోవాలని స్థానిక శాసన సభ్యులు అన్నాబత్తుని శివకుమార్ అన్నారు, బుథవారం తెనాలిరైల్యేస్టేషన్ వద్ద ఆయన విగ్రహానికి 116వ జయంతి సందర్భంగా నివాళులు అర్పించారు.అనంతరం ఆయన చేసిన సేవలు స్మరించుకొన్నారు. రాష్ట్ర బిసి సంఘ అద్యక్షులూ కేశన శంకరరావు మాట్లాడుతూ రాజ్యాథికారం అందరూ శాసించాలని సమాజంలోని బహుజనుల ఐకమత్యంగా ఉంటేనే ఇది సాథ్యమౌతుందన్నారు, దళితులు,బీసీలు, అణచివేతకు గురైన వర్గాల అభివృద్ధి, హక్కుల సాధనకు నిరంతరం పోరాటాలు, కార్మికోద్యమాలను నడిపారన్నారని పమిడిపాక జాస్మిన్ అన్నారు. కుల రహిత సమాజం కోసం తన జీవితాంతం కృషి చేసిన ఆదర్శ నాయకుడు డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్ అని న్యాయవాదులు దాసరి శ్రీథర్ ఇందుపల్లి జయరాం , అశోక్ కుమార్ లు అన్నారు. ఈ కార్యక్రమంలో ఛైర్మన్ ఖాలేదా నశీం తోటకూర రమణారావు, BC సంఘ నాయకుడు కాళిదాసు వేంకటేశ్వరావు కోలావాసు , సుకుమార్ ఎస్కేలు రత్నకుమారి రవికుమార్ కొమ్ము అబ్రహాం అక్కిదాసు కిరణ్ మాట్లాడుతూ సమాజం దగాపడ్డ వారికి ఆసరా కల్పించినమానవతా మూర్తి బాబూజీ జీవితం థన్యమైందన్నారు.
Prajavartha Online Telugu News