Breaking News

బోయ, వాల్మీకి, బెంతూ, ఒరియా కులాలను ఎస్టీ జాబితాలో చేర్చే తీర్మానాన్ని తక్షణం ఉపసంహరించుకోవాలి… : అనుముల వంశీకృష్ణ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
బోయ, వాల్మీకి, బెంతూ, ఒరియా కులాలను ఎస్టీ జాబితాలో చేరుస్తూ వైకాపా ప్రభుత్వం అసెంబ్లీలో చేసిన తీర్మానాన్ని తక్షణం ఉపసంహరించుకోవాలని ఆదివాసి గిరిజన సంఘాల ప్రతినిధులు తీర్మానం చేశారు. శుక్రవారం గాంధీనగర్లోని ప్రెస్లోబ్లో ఆదివాసి మేధావుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆదివాసీ మేధావుల వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు అనుముల వంశీకృష్ణ మాట్లాడుతూ సుమారు 60 లక్షల మంది ఉన్న వాల్మీకి, బోయలను ఎస్సీ జాబితాలో చేరిస్తే గిరిజనులు తమ హక్కులను కోల్పోయే ప్రమాదం ఉందని అవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైన కేంద్రం అయినా దీనిపై కమిషన్ ఏర్పాటు చేయాలన్నారు. మాజీ ఎమ్మెల్యేలు నిమ్మక జయరాజు, సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ అసెంబ్లీ సాక్షిగా ఆదివాసీలకు వైకాపా ప్రభుత్వం అన్యాయం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్టీ జాబితాలలో చేర్చుటకు అర్హతులేని బోయ, వాల్మికి, బెంతు ఒరియా కులాలచట్టవిరుద్ధమైన ప్రతిపాదనను కేంద్రం వెంటనే కలుగజేసుకుని వెనుకకు పంపించి తమ చిత్తశుద్దిని నిరూపించుకోవా లన్నారు. ఈ సమావేశంలో స్వప్నకుమారి, పి.బొజ్జప్ప, వంతూ బాలకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *