Breaking News

టెర్రస్‌ గార్డెన్స్‌ల ద్వారా మొక్కల పెంపకంపై శ్రద్ద పెట్టాలి…

-మిద్దె తోటల పెంపకం పట్ల ప్రజలు ఆసక్తి చూపాలి…
-జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
టెర్రస్‌ గార్డెన్‌ల ద్వారా పండ్లు ఆకుకూరలను స్వయంగా పండిరచి ఉపయోగించుకోవడం ద్వారా పూర్తి పౌష్టికాహారాన్ని తీసుకోగలుగుతారని మిద్దె తోటల పెంపకంపట్ల ప్రజలు మరింత ఆసక్తి చూపాలని జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు అన్నారు. రోటరీ క్లబ్‌ ఆఫ్‌ విజయవాడ ఈస్ట్‌ కార్యదర్శి సుంకర నాగభూషణం శనివారం నగరంలోని జిల్లా కలెక్టర్‌ డిల్లీరావును ఆయన కార్యాలయంలో కలిసి తుమ్మేటి రఫోత్తమరెడ్డి రచించిన విద్దె తోట పెంపకం పుస్తకాన్ని బహుకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రజలు దైనందిక జీవితంలో ఉద్యోగ వ్యాపారాలు కుటుంబ భాధ్యతలు పట్ల ఉన్న శ్రద్ద తీసుకునే ఆహార పదార్థాలపై చూపడం లేదన్నారు. జంక్‌ ఫుడ్స్‌, కల్తీ ఆహార పదార్థాలను తీసుకోవడంతో పాటు అధిక మోతాదులో రసాయనక ఎరువులను ఉపయోగించిన కూరగాయలు, ఆకుకూరలు, పండ్లను తీసుకోవడం వలన ఆరోగ్యపాలవుతున్నారన్నారు. మిద్దె తోటల పెంపకంలో మెలుకువలను వివరిస్తూ తుమ్మేటి రఫోత్తమరెడ్డి మిద్దె తోట పుస్తకం రచించడం శుభపరిణామం అన్నారు. నగర వాసులు వ్యాపార ప్రదేశాలు, బాల్కనీలు, టెర్రన్స్‌లు పై స్వల్పకాలిక ఆకుకూరలు కూరగాయలు పండ్లు పండిరచేందుకు ముందుకు రావాలన్నారు. గ్రామాలలో పెరటితోటల మాదిరిగా పట్టణాలలో మిద్దె తోటల పెంపకం పై ప్రజలు ఆసక్తి కనపరచాల్సిన అవసరం ఉందన్నారు. ఇటీవల నగరంలో దాదాపు 100 నుండి 150 మంది మిద్దె తోటలను చేపట్టి వాటి ద్వారా పండిరచిన పండ్లు కూరగాయలు ఆకుకూరలను పండిస్తున్నారన్నారు. ఎవరికివారు కనీసం వారి కుటుంబ అవసరాలకు సరిపడ కూరగాయలు ఆకుకూరలను స్వయంగా పండిరచి వినియోగించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. స్వయంగా పండిరచి తినడంలో తృప్తి, ఆనందం చెప్పగలిగింది కాదన్నారు. ప్రతి ఒక్కరిలో పండిరచు పంచు అనే భావం ఉండాలన్నారు. ప్రతి ఒక్కరూ టెర్రస్‌ గార్డెన్‌ నిర్వహణకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. టెర్రస్‌ గార్డెన్‌ నిర్వహించేవారికి ప్రభుత్వ పరంగా ప్రోత్సహకాలను అందిస్తామన్నారు. టెర్రస్‌ గార్డెన్స్‌ను చేపట్టేవారికి వర్మి కంపోస్టు, పోస్టు హర్వేస్ట్‌ టెక్నాలజిని, ట్రైకోడెర్మో, వంటి హాని తలపెట్టని ఫంగస్‌ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. నిర్వహుకులు విత్తనాలను శుద్ది చేసుకుని నాటేలా విత్తన శుద్దిపై అవగాహన కల్పిస్తామన్నారు. టెర్రస్‌ గార్డెన్‌ ద్వారా పండిరచిన కూరగాయలు, ఆకుకూరలను అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా కొనుగోలు చేసేందుకు చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్‌ డిల్లీరావు తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *