Breaking News

చదరంగం పోటీలలో జిల్లాకు జాతీయ గుర్తింపు తీసుకురావాలి..

-జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
చదరంగం పోటీలలో అత్యుత్తమ ప్రతిభ కనపరచి జిల్లాకు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావాలని జిల్లా కలెక్టర్‌ డిల్లీరావు జిల్లా చెస్‌ అసోసియేషన్‌ ప్రతినిధులను కోరారు. రాష్ట్రంలో ప్రపదంగా నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి బాలికల రేటింగ్‌ టోర్నమెంట్‌కు సంబంధించిన కరపత్రాలను జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు శనివారం ఆయన క్యాంప్‌ కార్యాలయంలో విడుదల చేశారు. జిల్లాకు చెందిన కోనేరు హాంపి, లలితబాబుతో పాటు అనేక మంది క్రీడాకారులు రాష్ట్రం తరుపున జాతీయ అంతర్జాతీయ స్థాయి చెస్‌ పోటీలలో పాల్గొన్ని విజేతలు కావడం ద్వారా ఎంతో పేరు ప్రఖ్యాతలను తీసుకువచ్చారన్నారు. రాష్ట్ర స్థాయి అండర్‌ 17 బాలికల రేటింగ్‌ టోర్నమెంట్‌ మొట్టమొదటి సారిగా నిర్వహించడం అభినందనీయమన్నారు. యువ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు పోటీలు ఎంతో దోహదపడుతాయన్నారు. ఈనెల 20 నుంచి 23వ తేది వరకు నిర్వహించే వీరమాచనేని విజయలక్ష్మి మెమోరియల్‌ చెస్‌ ఛాంపియన్‌ పోటీలు విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నట్లు జిల్లా కలెక్టర్‌ డిల్లీరావు తెలిపారు. కరపత్రాల విడుదల కార్యక్రమంలో జిల్లా చెస్‌ అసోసియేషన్‌ సెక్రటరీ ఎం ఫణికుమార్‌, టెజరర్‌ ఎస్‌ఎ గఫర్‌, పిఆర్‌వో రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *