రేణిగుంట, తిరుపతి జిల్లా, నేటి పత్రిక ప్రజావార్త :
రానున్న 2024 సంవత్సరంలో జరగబోవు సార్వత్రిక ఎన్నికలు 2024 సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి శ్రీ ముఖేష్ కుమార్ మీనా వారి ఆదేశాల మేరకు జిల్లాకు కేటాయించబడిన కొత్తగా మ్యానుఫ్యాక్చర్ చేయబడిన బెల్ ఎం3 ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు మరియు వివి ప్యాట్ లను భద్రపరచడం కొరకు గోడౌన్ లను అద్దె ప్రాతిపదికన తీసుకునే దిశలో జేసీ డికే బాలాజీ తో కలిసి రేణిగుంట విమానాశ్రయ సమీపంలోని సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వారి గోడౌన్ ను జిల్లా కలెక్టర్ కె వెంకటరమణారెడ్డి పరిశీలించి పలు సూచనలు చేశారు. సోమవారం మధ్యాహ్నం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వారి ఆదేశాల మేరకు రేణిగుంట విమానాశ్రయానికి సమీపంలో ఉన్న కేంద్ర గిడ్డంగి గోడౌన్ ను కలెక్టర్ పరిశీలించి సదరు గోడౌన్ మేనేజర్, సర్వేయర్ తో మాట్లాడుతూ ఈవీఎంలు వివి పాట్ లు భద్రపరుచుటకు సుమారు 16 వేల చదరపు అడుగులు అవసరమవుతుందని, భద్రత ప్రమాణాలు పాటించేలా ఏర్పాటు ఉండాలని, వాకిళ్లు, అగ్నిమాపక సాధనాలు, కరెంటు, సీసీటీవీ ల ఏర్పాటు తదితర భద్రత మరియు ఇతర ఏర్పాట్లు ఎన్నికల ప్రధాన అధికారి వారి నిబంధనల ప్రమాణాల మేరకు ఉండేలా చర్యలు చేపట్టాలని తదనుగుణంగా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి శ్రీనివాస రావు వారికి సూచించారు. ఈ కార్యక్రమంలో వీరితో పాటు రేణిగుంట తాసిల్దార్ శివప్రసాద్, మేనేజర్ కేంద్ర గిడ్డంగులు రమేష్ కుమార్ తదితర అధికారులు ఉన్నారు.
Prajavartha Online Telugu News