తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
హౌస్ కీపింగ్, కుకింగ్, మరియు కేర్ టేకర్ శిక్షణ తో పాటు గల్ఫ్ దేశాలలో ఉపాధి అవకాశాలు కల్పించే కార్యక్రమానికి 18 నుండి 45 సంవత్సరాలు లోపు గల మహిళా అభ్యర్ధుల నుండి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ దరఖాస్తులు కోరుతోందని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ కే వెంకట రమణ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా వారు వివరిస్తూ రాష్ట్రంలో కొద్ది మంది మహిళలు ఉపాధి కొరకు నకిలీ ఎజెంట్ల మోసాల వలలో చిక్కుకుని సరైన అర్హతలు పత్రాలు లేకుండా విదేశాలకు వెళ్లి అక్కడి చట్టాలు తెలియక మోసపోయి ఇబ్బందులు పడుతున్న విషయం గమనించిన రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రత్యేక కార్యక్రమం చేపట్టిందని తెలిపారు.
ఈ కార్యక్రమం లో భాగం గా రాష్ట్రం లో మూడు చోట్ల అనగా తూర్పు, పశ్చిమ గోదావరి మరియు కడప జిల్లాలో హౌస్ కీపింగ్, కుకింగ్ మరియు కేర్ టేకర్ అంశాలపై శిక్షణ ప్రారంబించిందనీ మన జిల్లాలోని యువత ఈ శిక్షణ ను సద్వినియోగం చేసుకోవాలని స్థానికంగానే శిక్షణ ఉంటుందని జిల్లా కలెక్టర్ తెలిపారు.
ఈ శిక్షణ లో భాగముగా విదేశాలలో అనుసరించే మత పరమైన సంస్కృతులు, వారి పద్దతులు, అలవాట్లు విధానాలు తో పాటు ఆయా దేశాల చట్టాల గురించి అవగాహన కల్పించడం తో పాటు శిక్షణ ఇవ్వడం జరుగుతుందని అన్నారు.
శిక్షణ అనంతరం వీరికి గల్ఫ్ దేశాలలో ఉపాధి చూపించడం జరుగుతుందని తెలిపారు.
శిక్షణ వలన ఉపయోగాలు:-
• ప్రభుత్వ అజమాయిషీ లో జరిగే కార్యక్రమం కాబట్టి నకిలీ ఏజెంట్లు బారిన పడి మోసపోవడం అనేది ఉండదు. వీరి ఉపాధికి ప్రభుత్వం భాధ్యత వహిస్తుంది.
• ఉపాధి పొందే ప్రాంతం యొక్క పరిస్థితులు అక్కడి ప్రజల మత పరమైన ఆచారాలు, భాష వంటి వ్యవహారాలపై శిక్షణ పొందుతారు కాబట్టి సదరు విషయాలపై పూర్తి అవగాహన కలిగి ఉంటారు.
• ఆ దేశపు చట్టాలపై పూర్తి అవగాహన కల్పిస్తారు కాబట్టి పొరపాట్లు చేయడానికి ఆస్కారం ఉండదు.
• ఉపాధి పొందడానికి వెళ్లిన ఉద్యోగి కి అక్కడ జీత భత్యాలలో మరియు పనిచేసే విషయంలో ఏమైనా ఇబ్బందులు తలెత్తిన సందర్భం లో భారత రాయబార కార్యాలయం భాధ్యత తీసుకుని వహిస్తుంది. వారికి తగిన సహాయం అందిస్తుంది.
ఎవరు అర్హులు?
• 5 వ తరగతి చదివి ఉండాలి
• చదవడం రాయడం తెలిసి ఉండాలి
• వయసు 18 నుండి 45 లోపు ఉండాలి.
• మహిళలు కు మాత్రమే ఈ శిక్షణ.
ఆసక్తి కలిగిన యువతీ యువకులు క్రింద ఇచ్చిన రిజిస్ట్రేషన్ లింకులో తప్పనిసరిగా నమోదు చేసుకోవలెను.
Registration Link: https://www.apssdc.in/home/onlineProgramRegistration
మరిన్ని వివరములకు క్రింద ఇచ్చిన మొబైల్ నెంబర్ను సంప్రదించగలరు.
Sukanya : 7675827308, తిరుపతి.
శిక్షణకు ఎంపిక కాబడిన అభ్యర్థులకు తిరుపతి జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ వారిచే శిక్షణ ఇవ్వబడుతుంది అని ఆ ప్రకటనలో కలెక్టర్ తెలిపారు.
Prajavartha Online Telugu News