Breaking News

కోవిడ్‌ వైరస్‌ ఎదుర్కోనేందుకు ముందస్తు చర్యలు తీసుకుంటున్నాం..

-జిజిహెచ్‌లో కోవిడ్‌ ప్రత్యేక విభాగం ఏర్పాటు చేసి వైద్యులు, సిబ్బందిని నియమించాం..
-జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు.
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
దేశ వ్యాప్తంగా కోవిడ్‌ కేసులు నమోదు అవుతున్న నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సూచనల మేరకు కోవిడ్‌ కేసులు నియంత్రించేందుకు అన్ని ముందస్తు చర్యలు తీసుకోవడంతో పాటు వైద్య అధికారులును సిబ్బందిని అప్రమత్తం చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు తెలిపారు.కోవిడ్‌ కేసులు నమోదు నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సూచనల మేరకు విజయవాడ ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రులలో సోమవారం జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు వైద్య అధికారులు, సిబ్బందితో కోవిడ్‌ మాక్‌ డ్రిల్‌ నిర్వహించి పలు సూచనలు చేశారు. అనంతరం మీడియా ప్రతినిధులతో జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా కోవిడ్‌ ఎక్స్‌ బి బి 1.16 వైరస్‌ వేరియంట్‌ కేసులు పెరుగుతున్నాయన్నారు. ఈ నేపథ్యంలో వైరస్‌ను ఎదుర్కొవడంతో పాటు కోవిడ్‌ రోగులకు చికిత్సను అందించేందుకు ఏర్పాటు చేయాలని ఇందుకు సంబంధించిన మాక్‌ డ్రిల్‌ను నిర్వహించి వైద్యాధికారులను సిబ్బందిని అప్రమత్తం చేయాలని సూచించడం జరిగిందన్నారు. జిల్లాలో కోవిడ్‌ ఎక్స్‌ బి బి 1.16 వైరస్‌ వేరియంట్‌ ప్రభావం అంతగా లేనప్పటికి అన్ని ముందు జాగ్రత్త చర్యలను తీసుకుంటున్నామన్నారు. దాదాపు 95 శాతం మందికి రెండు విడతల కోవిడ్‌ వ్యాక్సిన్‌ను, అవసరమైన వారికి అదనపు బూస్టర్‌ డోస్‌ను అందజేయడం జరిగిందన్నారు. వ్యాక్సిన్‌ తీసుకున్న వారిలో వైరస్‌ లక్షణాలు తక్కువగా కనిపిస్తాయని సాధరణ చికిత్సను అందించి వైరస్‌ బారి నుండి రక్షించగలుగుతామన్నారు. ప్రజలు కోవిడ్‌ ఎక్స్‌బిబి 1.16 వైరస్‌ వేరియంట్‌ను దృష్టిలో పెట్టుకుని కోవిడ్‌ నిబంధనలను తప్పక పాటించాలన్నారు. గతంలో మాదిరిగా తరచు చేతులను శుభ్రపరచుకోవడం, మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటి రక్షణ చర్యలను తీసుకుంటే వైరస్‌కి దూరంగా ఉండగలుగుతామన్నారు. జిల్లాలో ప్రస్తుతం ఏడుగురులో కోవిడ్‌ లక్షణాలను గుర్తించి వారికి వైద్యులు ప్రత్యేక చికిత్సను అందిస్తున్నారన్నారు. కోవిడ్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిలో 31 పడకలతో ప్రత్యేక కోవిడ్‌ విభాగాన్ని ఏర్పాటు చేసి వైద్య సేవలు అందించేందుకు వైద్యులను మందులను పిపి కిట్లను వంటిని సిద్దంగా ఉంచడం జరిగిందని జిల్లా కలెక్టర్‌ డిల్లీరావు అన్నారు.మాక్‌ డ్రిల్‌ పరిశీలనలో జిల్లా కలెక్టర్‌ వెంట ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రి సూపరిండెంట్‌ డా. సౌభాగ్యలక్ష్మి, డిహెచ్‌అండ్‌ హెచ్‌వో డా. యం సుహాసిని, ఆరోగ్యశ్రీ కో`ఆర్డినేటర్‌ డా. జె. సుమన్‌, పలువురు వైద్యులు సిబ్బంది ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *