Breaking News

జిల్లాలో మామిడి, మిర్చి, పత్తి పంటల ఎగుమతులను ప్రోత్సహించేలా బ్యాంకర్లు రైతులు, ఎగుమతి దారులకు విరివిగా బుణాలను అందించాలని జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు కోరారు.

-స్థానిక కలెక్టర్‌ విడిది కార్యాలయంలో సోమవారం జిల్లా కలెక్టర్‌ డిల్లీరావు అధ్యక్షతన జిల్లా స్థాయి సంప్రదింపుల కమిటీ ( డిస్ట్రిక్ట్‌ కన్సల్టెటివ్‌ కమిటీ ` డిసిసి) బ్యాంకర్స్‌ సమావేశం నిర్వహించారు.
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఈ సమావేశంలో జిల్లాలోని అన్ని బ్యాంకులకు నిర్దేశించిన బుణ లక్ష్యాలను సాధించిన ప్రగతిని ఆయా బ్యాంకుల ప్రతినిధులతో జిల్లా కలెక్టర్‌ సమీక్షించారు. సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్దిదారులకు బ్యాంకర్లు విరివిగా రుణాలను అందించి సహకరిస్తున్నారని ఇదే స్పూర్తిని కొనసాగించాలని కోరారు. ముఖ్యంగా వ్యవసాయ రంగానికి, స్వయం సహాయ సంఘాలకు నిర్దేశించిన లక్ష్యాల మేరకు సకాలంలో బుణాలను అందించి సహకరించాలన్నారు. బుణ లక్ష్యాల మంజూరును నూరు శాతం సాధించి జిల్లా ప్రగతికి సహకారం అందించాలని కలెక్టర్‌ కోరారు. సమావేశంలో 2023`24 వార్షిక బుణ ప్రణాళిక (యాన్వువల్‌ క్రెడిట్‌ ప్లాన్‌)ను కలెక్టర్‌ డిల్లీరావు విడుదల చేశారు.జిల్లాలో 2023`24 ఆర్థిక సంవత్సరానికి గాను ఈ ఏడాది రూ.39,000 కోట్లు వార్షిక ప్రతిపాదిత బుణ ప్రణాళిక లక్ష్యంగా నిర్ణయించామన్నారు. వీటిలో ప్రాధాన్యత రంగాలకు రూ.19,000 కోట్లు, ఇతర ప్రాధాన్యత రంగాలకు 20,000 కోట్ల రూపాయలు కేటాయించామన్నారు. ప్రతిపాదిత బుణ ప్రణాళికలో వ్యవసాయ రంగానికి రూ.8,500 కోట్లు కేటాయించగా, కౌలు రైతులతో సహా 5.10 లక్షల మంది రైతులకు రుణాల మంజూరు నిర్దేశించారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహ (యంఎస్‌యంఇ) రంగాలకు 7,800 కోట్ల రూపాయలు, గృహా నిర్మాణానికి 1000 కోట్ల రూపాయల రుణాల లక్ష్యాలను నిర్దేశించడం జరిగింది. ఎగుమతి రంగానికి బుణాల మంజూరులో ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్‌ డిల్లీరావు బ్యాంకర్లను కోరారు.కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ నిర్థేశించిన సంపూర్ణ జన సురక్ష కార్యక్రమాన్ని గ్రామ పంచాయతీ స్థాయిలో జూన్‌ 30వ తేది వరకు నిర్వహించాలన్నారు.ఈ కార్యక్రమానికి విసృత ప్రచారం నిర్వహించి పథకం ద్వారా ప్రధాన మంత్రి జీవన జ్వోతి, సురక్ష బీమా యోజన పథకంలో అర్హత ఉన్న ప్రతి ఒక్కరిని చేర్పించి లబ్ది చేకూర్చాలన్నారు. 15 రోజులకు ఒక సారి సమీక్షించి సూచనలు సలహాలు చేయాలని కలెక్టర్‌ కోరారు. జిల్లాలోని 292 గ్రామ పంచాయతీలలో 8 ప్రధాన బ్యాంకుల శాఖల ద్వారా క్యాంపులు నిర్వహించాలని కలెక్టర్‌ డిల్లీరావు బ్యాంకర్లను కోరారు.సమావేశంలో డిసిసి, కన్వినర్‌, యూనియన్‌ బ్యాంక్‌ డిప్యూటి జనరల్‌ మేనేజర్‌ యువి రజినీకాంతారావు, ఎల్‌డియం పి కోటేశ్వరరావు, నాబార్డ్‌ డిజియం మిళింద చౌల్కర్‌, డిఆర్‌డిఏ పిడి కె.శ్రీనివాస్‌, వివిధ బ్యాంకుల ప్రతినిధులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *