Breaking News

కారుణ్య నియామకం ద్వారా ఇద్దరికి (2) పోస్టింగ్, నియామకపు ఉత్తర్వులు అందించిన

-మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కమిషనర్ శ్రీ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్‌.
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగరపాలక సంస్థ నందు వివిధ విభాగములలో విధులు నిర్వహిస్తూ అనారోగ్య కారణాలతో మరణించిన వారి యొక్క కుటుంబ సభ్యులలో ఒకరికి కారుణ్య నియామకం క్రింద ఉద్యోగ అవకాశం కల్పించుటలో భాగంగా నేడు న‌గ‌ర పాల‌క సంస్థ కమాండ్ కంట్రోల్ రూమ్ నందు మేయర్ రాయన భాగ్యలక్ష్మి మరియు కమిషనర్ శ్రీ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్‌ తో కలసి ఇద్దరికి (2) కారుణ్య నియామకపు ఉత్తర్వులను స్వయముగా అందజేశారు.ఈ సందర్భములో కమిషనర్ మాట్లాడుతూ మీ యొక్క విద్యార్హతలను బట్టి జూనియర్ అసిస్టెంట్, (కండిషనల్ బేసిస్), ఆఫీసు సబ్ ఆర్డినేటర్ వంటి పోస్టింగ్ లను కేటాయిస్తూ వివిధ విభాగములలో పోస్టింగ్లు ఇచ్చుట జరిగిందని మీరందరూ విధి నిర్వహణలో బాధ్యతయుతముగా విధులు నిర్వహించాలని అన్నారు.

 

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *