-పనులను త్వరితగతిన పూర్తి చేయవలసినదిగా ఆదేశాలు,
-కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్.
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగరపాలక సంస్థ కమిషనర్ శ్రీ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్ సోమవారం అధికారులతో కలిసి కృష్ణలంక జాతీయ రహదారి ప్రక్కన గల అంబేద్కర్ పార్కును క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ, పార్కులో జరుగుతున్నవంటివి పునరుద్ధరికరణ పనులను పరిశీలించి, వాటి యొక్క వివరాలను మరియు ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయో అధికారులను అడిగి తెలుసుకొని కాంట్రాక్టు వర్కర్లను మరియు యంత్రాలను పెట్టి పనులు త్వరితగతిన పూర్తి చేయవలసినదిగా అధికారులకు ఆదేశించడమైనది.పర్యటనలో అదనపు కమీషనర్ (ప్రాజెక్ట్స్) కె.వి సత్యవతి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఏ.ఎస్.ఎన్ ప్రసాద్, ఎస్.ఇ (ప్రాజెక్ట్స్) నరసింహ మూర్తి, శానిటరీ ఇన్స్ పెక్టర్లు మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News