Breaking News

క్షయ వ్యాధి గ్రస్తులకు మెరుగైన పౌష్టికాహారం అందించడంతో సత్ఫలితాలు.

-2025 నాటికి క్షయ వ్యాధిని నిర్మూలించడమే లక్ష్యం..
-క్షయ వ్యాధి గ్రస్తులకు పౌష్టికాహరం అంధించేందుకు దాతలు ముందుకు రావాలి..
-జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు.
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
క్షయ వ్యాధి గ్రస్తులకు ఆరు నెలల పాటు మెరుగైన పోషక విలువలు గల పౌష్టికాహరాన్ని అందించడం ద్వారా ఆరోగ్య పరిస్థితులలో సత్ఫలితాలు సాధించగలిగామని 2025 నాటికి క్షయ వ్యాధిని సమూలంగా రూపు మాపేందుకు స్వచ్చంద సంస్థల సహకారం అవసరమని జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు అన్నారు.ప్రధాన మంత్రి నిక్షయ మిత్ర కార్యక్రమంలో భాగంగా జిల్లా క్షయ వ్యాధి నివారణ సంస్థ మరియు ఇండియన్‌ రెడ్‌ క్రాస్‌ సోసైటీ సంయూక్త ఆధ్వర్యంలో సోమవారం గాంధీ నగర్‌లోని రెడ్‌క్రాస్‌ భవనంలో క్షయ వ్యాధి గ్రస్తులకు ఆరవ విడత పౌష్టికాహార కిట్లను జిల్లా కలెక్టర్‌ డిల్లీరావు పంపిణీ చేశారుఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ క్షయ వ్యాధిని సమూలంగా రూపు మాపేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయన్నారు. ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ ఆధ్వర్యంలో క్షయ వ్యాధి గ్రస్తులకు ఒక్కొక్కరికి 700 రూపాయల విలువగల పౌష్టికాహారాన్ని ఆరు మాసాల పాటు అందించాలని నిర్ణయించడం జరిగిందన్నారు. ఇప్పటివరకు ఐదు నెలల పాటు పంపిణీ చేయడం జరిగిందన్నారు. పౌష్టికాహారం వినియోగించుకోవడం ద్వారా క్షయ వ్యాధిగ్రస్తుల ఆరోగ్యం మెరుగు పడిరదన్నారు. దీనితో పాటు సకాలంలో మెరుగైన వైద్య చికిత్సలు అందించడం ద్వారా 2025 సంవత్సరం నాటికి క్షయ వ్యాధిని సమూలంగా రూపు మాపడమే ప్రభుత్వ లక్ష్య మన్నారు. వ్యాధి గ్రస్తులకు ఉచితంగా మందులను పింపిణీ చేయడంతో పాటు దాతల సహకారంతో ఆరు నెలల పాటు పౌష్టికాహరాన్ని అందించామన్నారు. జిల్లాలో ప్రస్తుతం సుమారు 2,300 మంది క్షయ రోగులను గుర్తించడం జరిగిందన్నారు. వ్యాధి గ్రస్తులకు జిల్లా క్షయ వ్యాధి సంస్థ ఆధ్వర్యంలో 10 టిబి నివారణ కేంద్రాల ద్వారా మెరుగైన వైద్య చికిత్సను అందజేస్తున్నట్లు తెలిపారు. ఒక్కొక్కరికి ప్రభుత్వ సహాయం కింద నెలకు 500 రూపాలయలను చెల్లిస్తున్నామన్నారు. సోయాబీన్‌, శనగలు, బెల్లం, కందిపప్పు, బాదంపప్పు, రాగి పిండి, మంచినూనె వంటి పౌష్టిక విలువలతో కూడిన ఆహారాన్ని క్షయ వ్యాధి గ్రస్తులకు అందించేందుకు దాతలు ముందుకు రావాలన్నారు. ఇండియాన్‌ రెడ్‌క్రాస్‌ సంస్థ సహకారంతో ఐదువందల మందికి ఆరు నెలల పాటు పౌష్టికాహరాన్ని అందించే కార్యక్రమంలో బాగస్వామ్యులైన రెడ్‌క్రాస్‌ సంస్థ బృందాన్ని ప్రత్యేకంగా అభినందిస్తున్నట్లు జిల్లా కలెక్టర్‌ డిల్లీరావు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సోసైటీ జిల్లా అధ్యక్షలు డా. జి. సమరం, జిల్లా క్షయ వ్యాధి నివారణ అధికారి డా. ఉషారాణి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డా. యం సుహాసిని, క్షయ వ్యాధి నివారణ ప్రోగ్రామ్‌ ఆఫీసర్‌ యం చిన్నికృష్ణ, రైడ్‌కాస్ర్‌ సోసైటీ మేనేజర్‌ సిహెచ్‌. శ్రీనివాస్‌రావు, డిజాస్టర్‌ కో`ఆర్డినేటర్‌ పి. రాధిక, అసిస్టెంట్‌ మేనేజర్‌ టి. సునీత తదితరులు ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *