విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు చేరువ చేసే విధంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన అందిస్తున్నారని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ పేర్కొన్నారు. బుధవారం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా 5వ డివిజన్, 20వ సచివాలయం పరిధిలో అరుళ్ నగర్ బస్సు స్టాప్ నుండి మొదలై చిన్నయ గారి బజార్ , మీసాల రమణ స్ట్రీట్, గంటా అపార్ట్మెంట్ ప్రాంతాలలో నాయకులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లతో కలసి ఇంటింటికి వెళ్లిన అవినాష్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ క్యాలెండర్ అందజేశారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ అభివ్రద్ధి, సంక్షేమమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పాలన అందిస్తుందన్నారు.కొండ చిట్టచివరి ఇంటి వరుకు తాగునీటి సౌకర్యం కల్పించే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కొండ ప్రాంతంలో మెట్లు, సిమెంట్ రోడ్లను కూడా నిర్మించామని అన్నారు. కొండ ప్రాంతంలో నెలకొన్న మెట్లు, డ్రైనేజీ, తాగునీటి సమస్యలను యుద్ధ ప్రాతిపదికన పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఇచ్చిన మాట ప్రకారం కులమత పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తూ నవరత్నాలతో పేదవారి జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు అని అన్నారు. ఒక్కో కుటుంబానికి ఇళ్ళ స్థలంతో కలిపి దాదాపు 10లక్షల రూపాయల పైగా లబ్ది చేకూరింది అని వారి సంతోషం వ్యక్తం చేస్తున్నారు అని అన్నారు.కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ, 5వ డివిజన్ కార్పొరేటర్ అంబెడ్కర్ డివిజన్ అధ్యక్షులు ప్రసాద్ వైస్సార్సీపీ నాయకులు విటల్,లోకేష్ లామ్ కిరణ్,అప్పారావు,రమేష్ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News