Breaking News

దాతల సహకారంతో ప్రజలకు మరిన్ని మౌలిక సదుపాయాలు

-పుట్టగుంట హెల్త్‌ ఫౌండేషన్‌ సేవలు అభినందనీయం
-జిల్లా కలెక్టర్‌ఎస్‌ డిల్లీరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
దాతల మందుకు వస్తే ప్రజలకు మరిన్ని మౌలిక సదుపాయాలను కల్పించగలుగుతామని పుట్టగుంట వెంకట సతీష్‌ హెల్త్‌ ఫౌండేషన్‌ ద్వారా అందిస్తున్న సామాజిక సేవలు అభినందనీయమని జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు అన్నారు.పుట్టగుంట వెంకట సతీష్‌ హెల్త్‌ ఫౌండేషన్‌ సహకారంతో జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో 2.50 లక్షల రూపాయల ఖర్చుతో ఏర్పాటు చేసిన రక్షిత మంచి నీటి పథకం (ఆర్‌వో ప్లాంట్‌)ను సోమవారం జిల్లా కలెక్టర్‌ డిల్లీరావు ప్రారంభించారు. అనంతరం జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన మౌలిక వసతులను కల్పించడంలో ప్రభుత్వం అనేక కార్యక్రమాలను చేపట్టడం జరిగిందన్నారు. స్వచ్చంద సంస్థలు దాతలు సహకారిస్తే ప్రజలకు మరిన్ని మౌలిక సదుపాలయాలను కల్పించగలుగుతామన్నారు. జిల్లాల పునర్వీవస్తీకరణ ఏర్పాడిన అనంతరం ఎన్‌టిఆర్‌ జిల్లా కలెక్టరేట్‌ కార్యాలయానికి స్పందనతో పాటు వివిధ పనుల నిమిత్తం నిత్యం వందలాధి మంది ప్రజలు తరలివస్తారన్నారు. కలెక్టరేట్‌ ద్వారా త్రాగునీటి సౌకర్యం కల్పిస్తున్నామన్నారు. పుట్టగుంట హెల్త్‌ ఫౌండేషన్‌ తరుపున శాశ్వత పద్దతి శాశ్వత రక్షిత మంచి నీటి పథకం (ఆర్‌వో ప్లాంట్‌)ను ఏర్పాటు చేసేందుకు ముందుకు రావడం జరిగిందన్నారు. కలెక్టరేట్‌ కార్యాలయ సిబ్బందికి ప్రజలకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. సమాజాభివృద్ధిలో భాగస్వామ్యులయ్యేందు స్వచ్చంద సంస్థలు దాతలు ముందుకు వస్తే ప్రజలకు మరిన్ని మౌలిక సదుపాలయాలను కల్పించేందుకు అవకాశం ఉంటుందని జిల్లా కలెక్టర్‌ డిల్లీరావు అన్నారు.
పుట్టగుంట హెల్త్‌ ఫౌండేషన్‌ చైర్మన్‌ పి వెంకట సతీష్‌ మాట్లాడుతూ తన ఫౌండేషన్‌ ద్వారా ఉమ్మడి కృష్ణాజిల్లాలో అనేక సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహించడం జరిగిందన్నారు. ముఖ్యంగా విద్య, వైద్య, ఆరోగ్య విషయాలపై ప్రత్యేక దృష్టి పెట్టి ఉచిత వైద్య శిభిరాలను నిర్వహించి పేద ప్రజలకు వైద్య సహాయం అందించడంతో పాటు ఉచితంగా మందులను పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. పాఠశాలలో అభివృద్ధిలో భాగంగా తరగతి గదులల నిర్మాణం పేదల విద్యార్థులకు పుస్తకాలు, స్కాలర్‌షిప్‌లను అందజేస్తున్నామన్నారు. గ్రామాలలో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు తమవంతు సహకారం అందిస్తున్నామన్నారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ తనదైన శైలిలో ప్రజ సమస్యలను పరిష్కరిస్తున్న జిల్లా కలెక్టర్‌ తీరు తనను ఎంతగానో ఆకర్షించిందన్నారు. ఇటీవల విజయమేరీ పాఠశాలలో జరిగిన ఆర్‌వో ప్లాంట్‌ ప్రారంభోత్సవంలో అవసరమైన చోట్ల ఆర్‌వో ప్లాంట్లు ఏర్పాటు చేయాలని తనను కోరారని, ఆ మేరకే కలెక్టర్‌ కార్యాలయంలో నూతనంగా ఆర్‌వో ప్లాంట్‌ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రజలకు అవసరమైన సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహించేందుకు పుట్టగుంట హెల్త్‌ ఫౌండేషన్‌ సహకారం ఎల్లప్పుడు అందిస్తామని తెలిపారు.కార్యక్రమంలో డిఆర్‌వో కె. మోహన్‌కుమార్‌, కలెక్టరేట్‌ ఏవో ఇంతియాజ్‌ పాషా, అసిస్టెంట్‌ కలెక్టర్లు ఎస్‌ రామలక్ష్మి, ఖతీఫ్‌ కౌసరా బానో, లైన్స్‌ క్లబ్‌ విజయవాడ పూర్వపు అధ్యక్షులు మిరియాల వెంకటేశ్వరరావు, లైన్స్‌ క్లబ్‌ ప్రతినిధులు శంకర్‌గుప్త్‌, సిహెచ్‌ శ్రీనివాసరెడ్డి, రామకృష్ణప్రసాద్‌, రామిశెట్టి కొండలరావు శారదవాణి, కె. రామకృష్ణప్రసాద్‌ బోమ్మదేవర వడయవర్లు, కలెక్టర్‌ కార్యాలయం అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *