విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్ర ప్రదేశ్ తెలుగు జర్నలిస్టుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు మేడవరపు రంగనాయకులు, వర్కింగ్ ప్రెసిడెంట్ మాలెంపాటి శ్రీనివాస రావు, లీగల్ అడ్వైజర్ దద్దాల జగదీశ్ లు సి. రాఘవాచారి ఆంధ్ర ప్రదేశ్ ప్రెస్ అకాడెమి చైర్మన్ కొమ్మినేని శ్రీనివాస రావు ను ఆయన కార్యాలయంలో మంగళ వారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా లక్ష్యాలను వారు చైర్మన్ కు వివరించారు. జర్నలిస్టులను ప్రోత్సహించే వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించిందని వారు వివరించారు. ఇందులో భాగంగా ఆంధ్ర ప్రదేశ్ తెలుగు జర్నలిస్టుల సంఘం ఆధ్వర్యం లో ఉగాది పురస్కారాలకు రెండు తెలుగు రాష్ట్రాల లోని జర్నలిస్టుల నుంచి ఎంట్రీలు కోరిందని తెలిపారు. దీనికి సంబంధిచి వందల సంఖ్య లో ఎంట్రీలు రాగా, వాటిలోంచి 23 విభాగాలకు చెందిన పురస్కారాలకు అవార్డులు ప్రకటించామని వారు చైర్మన్ కు వివరించారు. వీరందరికి ‘మే’ నెల 2 వ తేదీన గుంటూరు లో ఒక ప్రత్యేక కార్యక్రం నిర్వహించి అవార్డులు అందచేయ నున్నామని వారు తెలిపారు. ఆ అవార్డుల ప్రదాన కార్యక్రమానికి హాజరు కావాల్సింది గాప్రెస్ అకాడమి చైర్మన్ ను కోరారు. తమ సంఘం లో సభ్యత్వం తీసుకునే జర్నలిస్టులకు 10 లక్షల మేర బీమా సౌకర్యం కల్పిస్తున్నామని వారు తెలిపారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ నూతనంగా ఆవిర్భవించిన ” ఆంధ్ర ప్రదేశ్ తెలుగు జర్నలిస్టుల సంఘం “జర్నలిస్టుల కు మరింత ప్రోత్సాహం ఇవ్వాలని కోరారు. జర్నలిస్టుల అవార్డుల ప్రదాన కార్యక్రమానికి తాము హాజరవుతామని చైర్మన్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ అకాడమి సెక్రెటరీ మామిడిపల్లి బాల గంగాధర్ తిలక్ పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News