Breaking News

మహాత్మా జ్యోతిరావు ఫూలే కు విద్యుత్ సంస్థలు ఘన నివాళి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సాంఘిక సంస్కర్త మహాత్మా జ్యోతిరావు ఫూలే జయంతి సందర్భంగా ఏపీ జెన్కో మేనేజింగ్ డైరెక్టర్ మరియు జెఎండీ ఏపీట్రాన్స్కో కెవీఎన్ చక్రధర్ బాబు , సిఎండీ ఏపీఈపీడీసిఎల్ గా నియమితులైన ఐ పృద్వి తేజ్, జెఎండీ విజిలెన్స్ ఏపీ ట్రాన్స్కో బీ మల్లా రెడ్డి మరియు ట్రాన్స్కో , జెన్కో సీనియర్ అధికారులు, సిబ్బంది ఆయనకు ఘన నివాళి అర్పించారు.

ఈ సందర్భంగా విద్యుత్ సౌధ లో మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో ఎండీ జెన్కో చక్రధర్ బాబు మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావు ఫూలే దేశానికి అందించిన సేవలను కొనియాడారు . దేశంలో కుల వ్యవస్థ , అస్పృశ్యత నిర్మూలనకు, మహిళలు, దళితులు , అణగారిన వర్గాల అభ్యున్నతికి మహాత్మా ఫూలే అలుపెరగని కృషి చేసారని పేర్కొన్నారు. ఆ మహానుభావుని త్యాగాలు భారత జాతి మరువదని అన్నారు.

సమాజంలో అణచివేతకు గురవుతున్న వర్గాలవారికి సమాన హక్కులు సాదించేందుకు తన అణుచరులతో కలిసి సత్యశోధక్ సమాజ్ స్థాపించారని తెలిపారు. ఈ సమాజంలో అన్ని వర్గాల ప్రజలు కలిసి మెలిసి ఉండే విధంగా ఆయన కృషి చేశారన్నారు. మహాత్మా ఫూలే ఆశయాల అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం బలహీన వర్గాల సంక్షేమం కోసం రాష్ట్ర విద్యుత్ రంగంలో నవరత్నాల అమలు చేస్తున్నదని ఆయన తెలిపారు .

ప్రభుత్వం అందిస్తున్న వ్యవసాయానికి 9 గంటల ఉచిత విద్యుత్ వల్ల అనేక మంది చిన్న, సన్నకారు రైతులు ప్రయోజనం పొందుతున్నారన్నారు. నెలకు 200 యూనిట్ల లోపు విద్యుత్ వినియోగించే ఎస్సి, ఎస్టీలకు ప్రభుత్వం ఉచిత విద్యుత్ ను అందచేస్తోందన్నారు. ఎంబీసి, ధోబీఘాట్లు, లాండ్రీలు , స్వర్ణకార కార్మికులు , సెలూన్లు , బంగారు ఆభరణాలు, చేనేత కార్మికులు , చెరుకు క్రషర్లు, గ్రామీణ ఉండేనా నర్సరీలు మొదలైన వాటికి ఉచిత , సబ్సిడీ విద్యుత్ ను ప్రభుత్వం కొనసాగిస్తోందన్నారు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ కోసం రూ 7641. 85 కోట్లు , ఆక్వాకల్చర్ రంగానికి రూ 1206. 20 కోట్లు , ఇతర వర్గాలకు రూ 1238.30 కోట్లను సబ్సిడీగా ప్రభుత్వం కేటాయించినట్లు తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ రంగంలో అమలు చేస్తున్న అన్ని సంక్షేమ పథకాలను సమర్ధవంతంగా అమలు చేసేందుకు ఏ పీ ట్రాన్స్కో, ఏ పీ జెన్కో నిబద్దతతో కృషి చేస్తున్నాయని చక్రధర్ బాబు తెలిపారు. అలాగే వినియోగదారులందరికి నాణ్యమైన సేవలు అందచేసేందుకు విద్యుత్ సంస్థలు అంకిత భావంతో పని చేస్తున్నాయన్నారు . డైరెక్టర్, గ్రిడ్ & ట్రాన్స్మిషన్ , ఏవీకె భాస్కర్ , డైరెక్టర్ ఫైనాన్స్ / ఏ పీ ట్రాన్స్కో , టీ వీరభద్ర రెడ్డి , జెన్కో డైరెక్టర్లు , జీ చంద్రశేఖర రాజు , బీ వెంకటేశులు రెడ్డి , ఆంటోనీ రాజా తదితర సీనియర్ అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *