Breaking News

ఈ నెల 15 నుండి 61 రోజులు సముద్రంలో చేపల వేట నిషేధం : జిల్లా కలెక్టర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రాదేశిక సముద్ర జలాలలో చేపల వేట చేయు యాంత్రిక పడవలు అనగా మెకనైజ్డ్ మరియు మోటారు బోట్ లు ద్వారా నిర్వహించు అన్ని రకాల చేపల వేట ను ఈ నెల 15 నుండి జూన్ 14 వరకు 61 రోజులు పాటు ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు చేపల వేట నిషేధం అమలులో ఉంటాయని జిల్లా కలెక్టర్ కె.వెంకట రమణ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. సముద్ర జలాలలో చేపల వేట నిషేధం ఉద్దేశ్యం – వివిధ చేప, రొయ్యల జాతులు సంతానోత్పత్తి కాలములో తల్లి చేపలు మరియు రొయ్యలను సంరక్షించడం , వాటి సంతతి పెరుగుదలను ప్రత్సహించడం , తద్వారా సముద్ర మత్స్య సంపద సుస్థిరతను సాదించడo కోసమని అన్నారు. సముద్ర జలాలలో యాంత్రిక పడవలు ( మెకనైజ్డ్ మరియు మోటారు బోట్ల ) పై మత్స్య కారులు ఎటువంటి చేపల వేట చేయకుండా మత్స్య అభివృద్ధికి సహకరించాలని తెలిపారు. నిషేధ ఉత్తర్వులను ఉల్లంఘించి చేపల వేట చేసిన యెడల ఆయా బోట్ల యజమానులు ఆంధ్ర ప్రదేశ్ సముద్ర మత్స్య క్రమ బద్ధీకరణ చట్టము (AP MFC Act) 1994, సెక్షన్ (4) ను అనుసరించి శిక్షర్హులు , అట్టి వారి బోట్లను, బోట్లలో ఉండే మత్స్య సంపదను స్వాధీన పరచుకొనుటయే గాక, జరిమానా విధిస్తు , డీజీల్, ఆయిల్ రాయితీ మరియు ప్రభత్వం అందించే అన్ని రకముల రాయితీ సౌకర్యాలను నిలుపుదల చేయబడునని తెలిపారు. ఈ నిషిద్ధ కాలమును ఖచ్చితంగా అమలు చేయుటకై మత్స్యశాఖ , కోస్ట్ గార్డ్ , కోస్టల్ సెక్యూరిటీ పోలీసులు, నేవి మరియు రెవిన్యూ అధికారులతో గస్తీ ఏర్పాటు చేయడమయినదని, కావున మత్స్యకారులు అందరు సహకరించవలసినదిగా కలెక్టర్ ఆ ప్రకటనలో తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *