Breaking News

సర్వే రాళ్ళు నాటే ప్రక్రియను వేగవంతం చేయండి

-సి.సి.ఎల్.ఏ. స్పెషల్ చీఫ్ సెక్రెటరీ సాయిప్రసాద్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆయా గ్రామాలలో నిర్దేశించుకున్న గడువులోగా సర్వే రాళ్లు నాటే ప్రక్రియను వేగవంతం చేసేలా చూడాలని సి.సి.ఎల్.ఏ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ జి.సాయిప్రసాద్ అన్ని జిల్లాల కలెక్టర్ లను ఆదేశించారు. గురువారం విజయవాడ సి.సి.ఎల్.ఏ. కార్యాలయం నుండి స్పెషల్ చీఫ్ సెక్రెటరీ వెబ్ ల్యాండ్, సర్వే రాళ్లు నాటే ప్రక్రియ, భూ హక్కు పత్రాల పంపిణీ, తదితర అంశాలపై అన్ని జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లతో వీడియో కన్ఫెరెన్స్ నిర్వహించగా జిల్లా కలెక్టరేట్ నుండి జిల్లా జాయింట్ కలెక్టర్ డి.కె.బాలాజీ, డి.ఆర్.ఓ. శ్రీనివాస రావు, జిల్లా సర్వే అధికారి జయరాజ్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సంధర్భంగా సి.సి.ఎల్.ఏ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ మాట్లాడుతూ.. సర్వేరాళ్ళు నాటే ప్రక్రియను నిర్దేశించిన గడువులోగా త్వరిత గతిన పూర్తి చేయాలన్నారు. రైతుల భూ విస్తీర్ణంతోపాటు వెబ్ ల్యాండ్ లో నమోదు అయిన భూ విస్తీర్ణమును సరి పోల్చుకోవాలని అన్నారు.

వీడియో కన్ఫెరెన్స్ అనంతరం జిల్లా జాయింట్ కలెక్టర్ సంబందిత అధికారులతో మాట్లాడుతూ.. రీ సర్వే ప్రక్రియలో భాగంగా జిల్లాలో మొదటి దశ కు సంబంధించి 39322 సర్వే రాళ్ళు నాటే లక్ష్యంలో భాగంగా 21396 సర్వే నాటే ప్రక్రియను పూర్తయిందని మిగిలిన పనులను గడువులోపు పూర్తయ్యేలా చూడాలని అన్నారు. సర్వే రాళ్లు నాటే ప్రక్రియలో భాగంగా ఎక్కువమందితో టీం వర్క్ గా పని చేస్తే రాళ్లు నాటే ప్రక్రియ పూర్తి అవుతుందన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *