Breaking News

సార్వత్రిక ఎన్నికలు సజావుగా జరిగేందుకు స్టాండర్డ్ ఆపరేటింగ్ సిస్టం ఏర్పాటుకు చర్యలు : ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా

-రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశాలను, ఎన్నికల నిబంధనలను అమలు చేస్తాం : జిల్లా కలెక్టర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
రానున్న సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా ఆఫీసర్ వెలగపూడి నుండి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఓటరు జాబితాలో మార్పులు చేర్పులు, ఎన్నికలు సజావుగా జరిగేందుకు స్టాండర్డ్ ఆపరేటింగ్ సిస్టం ఏర్పాటుకు చర్యలు, పెండింగ్ ఎన్నికల అంశాలు, ప్రింటింగ్ ఆఫ్ పివిసి ఎపిక్ కార్డులు ప్రింటింగ్ సరఫరా మరియు సంబంధిత ఓటరుకు స్పీడ్ పోస్ట్ ద్వారా పంపడం రానున్న సార్వత్రిక ఎన్నికల లో అనుసరించాల్సిన విధివిధానాలపై తదితర అంశాలపై సమీక్షించగా తిరుపతి జిల్లా నుండి జిల్లా కలెక్టర్ కె వెంకటరమణారెడ్డి జేసీ డి కే బాలాజీ తో కలిసి కలెక్టరేట్ నుండి హాజరయ్యారు.

గురువారం మధ్యాహ్నం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ సుమోటో గా ఓటర్లను తొలగించ రాదని, నోటీస్ ఇచ్చిన తర్వాత సరిచూసుకుని మాత్రమే తదుపరి చర్యలు తీసుకోవాలని సూచించారు. బి ఎల్ ఓ రిజిస్టర్ నిర్వహణ ఉండాలని, ఈ నెల ఆఖరి లోపు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ ఆర్ ఓ నెట్ 2.0 ఈనెల 17 నుండి అందుబాటులోకి రానున్నదని అన్నారు. పెండింగ్ క్లైమ్స్, అబ్జెక్షన్స్ పై దృష్టి సారించి పరిష్కరించే దిశలో చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రాబోవు సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల నిర్వహణ సజావుగా జరిగేందుకు ఎలెక్టోరల్ రోల్, పోలింగ్ స్టేషన్ల గుర్తింపు, ఈ వి ఎం, ప్లానింగ్, పోలింగ్ సిబ్బంది, బ్యాలెట్ పేపర్, లా అండ్ ఆర్డర్, ఎలక్షన్ వ్యయం పర్యవేక్షణ, ఎన్నికల ప్రవర్తనా నియమావళి, పోలింగ్, కౌంటింగ్ తదితర అంశాలపై ప్రణాళిక రచించుకుని ఒక పద్ధతిగా ముందుకు వెళ్లేలా ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ సిస్టం ఏర్పాటుకు వివిధ జిల్లాల కలెక్టర్లు మరియు జిల్లా ఎన్నికల అధికారులతో కమిటీ లు ఏర్పాటు చేసి ఎస్ ఓ పి కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు లోబడి ఉండేలా నెల ఆఖరి లోపు ఒక మ్యాన్యువల్ తయారు అవ్వాలని సూచించారు.

అంతే కాకుండా ఈవిఎం లు, వివి ప్యాట్ వాటి సంబంధిత పరికరాలను భద్ర పరుచుటకు గోడౌన్ లు పూర్తి స్థాయిలో భద్రత ప్రమాణాలు మేరకు అందుబాటులో ఉండేలా చూడాలనీ, తొందరలోనే ఈవిఎం, వివిప్యాట్, బియు, సియు, బ్యాటరీ తదితరాలు అన్ని జిల్లాలకు అందేలా షెడ్యూల్ ను పంపుతామని సంసిద్ధంగా ఉండాలని కలెక్టర్లకు సూచించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ వివరిస్తూ జనవరి 5, 2023 నాటికి జిల్లాలోని ఓటర్ల తుది జాబితా మేరకు పురుషులు 847343, మహిళలు 879992, ట్రాన్స్ జెండర్లు 241 వెరసి మొత్తం 1727576 గా నమోదు అయ్యారని దీనికి సంబంధించి 2112 పోలింగ్ స్టేషన్లు గుర్తించడం జరిగిందని వివరించారు. ప్రధాన ఎన్నికల అధికారి వారి నుండి సమయానుసారంగా వచ్చే ఆదేశాలను అమలు చేస్తామని తెలిపారు.

జిల్లాలో ఈ పి రేషియో, జెండర్ రేషియో అంశాలను వివరించి 18-19 సం. ల యువత ను గుర్తించి నమోదుకు తగు చర్యలు చేపడతామని, బిఎల్ఓ లు రిజిస్టర్లు నిర్వహణ, గిరిజన ఓటర్లను కవర్ అయ్యేలా చర్యలు చేపడతామని అన్నారు. ఎస్ఓపి తయారీలో తిరుపతి జిల్లాకు కేటాయించిన బూత్ క్యాప్చరింగ్, రిసెప్షన్ ఏర్పాట్ల సబ్జెక్టు లపై సకాలంలో నివేదిక పూర్తి స్థాయిలో అందజేస్తామని సి ఈ ఓ వారికి తెలిపారు. పివిసి ఎపిక్ కార్డులు ప్రింటింగ్ ఏజెన్సీ నుండి అందాయని వెంటనే అందిన వాటిని అందినట్లుగా స్పీడ్ పోస్ట్ ద్వారా సంబంధిత ఓటరుకు పంపడం జరుగుతుందని తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *