తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
హెచ్ సి ఎల్ టెక్నాలజీస్ కంపెనీ యొక్క టెక్ బి ఎర్లీ కెరీర్ ప్రోగ్రాం ద్వారా 2022 సంవత్సరంలో ఉత్తీర్ణులైనట్టి మరియు 2023 సంవత్సరం ఇంటర్ రెండవ సంవత్సరం పరీక్షలు వ్రాసిన అభ్యర్థులకు HCL Technologies – రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ సంయుక్తంగా సెలక్షన్ డ్రైవ్స్ రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్నారు. ఈ డ్రైవ్ లో పాల్గొనటానికి అభ్యర్థులు ఏదేని గ్రూప్ లో ఇంటర్ చదివి పది మరియు ఇంటర్మెడియట్ లలో కనీసం 60 % మార్కులు సాధించిన అభ్యర్థులు అర్హులు.
హెచ్ సి ఎల్ టెక్నాలజీస్ టెక్ బి ఎర్లీ కెరీర్ ప్రోగ్రాం ద్వారా ఎంపికకై శిక్షణ పూర్తి చేసుకున్నవారు హెచ్ సి ఎల్ టెక్నాలజీస్ నందు ఫుల్ టైం ఉద్యోగ అవకాశాన్ని పొందుతారు. ప్రాధమికంగా, ఎంపికైన అభ్యర్థులకు 6-12 నెలల శిక్షణ మరియు ఇంటర్న్షిప్ ఇవ్వడము జరుగుతుంది. ఇంటర్న్షిప్ శిక్షణా కాలములో నెలకు 10000/- చొప్పున స్టైపెండ్ ఇవ్వబడుతుంది. శిక్షణ పూర్తి చేసిన అభ్యర్థులకు సంవత్సరానికి 1.7 లక్ష నుండి 2.2 లక్షలు ప్రాధమిక వేతనాన్ని పొందుతారు. అభ్యర్థుల సామర్థ్యాన్ని బట్టి Software Developer, Design Engineer, Tech Analyst, Support & Process Associate తదితర అవకాశాలు కల్పించబడును. అంతే కాకుండా ఉద్యోగముతో పాటు ఉన్నత విద్యను బిట్స్ ఫిలని, సస్త్ర , ఆమిటీ యూనివర్సిటీ, ఐఐఎం నాగపూర్ మరియు K L యూనివర్సిటీ వంటి విధ్యా సంస్థలలో అభ్యసించడానికి అవకాశము ఉంటుందని D.I.E.O విశ్వనాథ నాయక్ ఒక ప్రకటనలో తెలిపినారు. ఈ అద్భుతమైన అవకాశాన్ని సదరు అభ్యర్థులు ఉపయోగించుకోవాలని తెలిపినారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు తప్పనిసరిగా bit.ly/techbee22 లింక్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాలకు అశోక్ కుమార్ – 9032697478 కు సంప్రదించండి.
Tags tirupathi
Check Also
అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం
-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …
Prajavartha Online Telugu News