Breaking News

ప్రజా సమస్యల తక్షణ పరిష్కారానికే గడపగడపకు : దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అమలు చేస్తున్న సంక్షేమ పథకాలును ప్రజలకు వివరించి వారి సమస్యల తక్షణ పరిష్కారం కోసమే గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం చేపట్టాడం జరిగింది అని తూర్పు నియోజకవర్గ వైస్సార్సీపీ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ పేర్కొన్నారు. గురువారం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా 5వ డివిజన్ 19వ సచివాలయం పరిధిలోని పెద్దబావి సెంటర్ రోడ్ నుండి మొదలై మల్లెల వారి స్ట్రీట్,మట్టా వారి స్ట్రీట్,మాచెర్ల స్ట్రీట్ ప్రాంతాలలో నాయకులతో అధికారులతో కలిసి ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు గురుంచి వివరించారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వం అని, ఇచ్చిన ప్రతి మాటను నెరవేర్చే దిశగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలన చేస్తున్నారు అని అన్నారు. వైస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాతే నవరత్నాలతో పేదల బ్రతుకుల్లో వెలుగులు నిండాయని, వారికి ఆర్థిక భరోసా కల్పించే దిశగా ప్రభుత్వ పాలన కొనసాగుతుంది అని అన్నారు. కొండప్రాంతంలో పర్యటిస్తుంటే గత టీడీపీ ప్రభుత్వంలో మమ్మల్ని పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తే నేడు వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కొండంచున నివసిస్తున్న మా వద్దకే వలంటీర్ లు వచ్చి పెన్షన్ అందించడంతో పాటు, చివరి ఇంటి వరకు మంచినీటి పైప్ లైన్ వేసి మా కష్టాలు తీర్చిన దేవుడు జగనన్న అని మహిళలు వారి సంతోషాన్ని వ్యక్తం చేస్తుంటే చాలా గర్వంగా ఉంది అని అవినాష్ అన్నారు.ప్రభుత్వం ఇన్ని మంచి కార్యక్రమాలు చేపడుతుంటే ఓర్వలేక ప్రతిపక్షాలు ప్రజలు విసుగుచెందారు అన్నట్టు ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటు అని, రాష్ట్రంలో గతంలో ఏ ముఖ్యమంత్రి చేయనివిధంగా జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు అమలు చేశారు కాబట్టే నిన్న స్వయానా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా అధికారంలోకి వస్తే ఆ సంక్షేమ పథకాలు కొనసాగిస్తామని చెప్పారంటేనే అర్థం అవుతుంది ప్రజల గుండెల్లో అవి ఎంతగా నిలిచి ఉన్నాయని అన్నారు. ప్రజలు కూడా మంచి చేస్తున్న ఈ ప్రభుత్వానికి అండగా నిలవాలని మరలా వైసీపీ ప్రభుత్వాన్ని ఆదరించాలని అవినాష్ కోరారు. ఈ కార్యక్రమంలో 5వ డివిజన్ కార్పొరేటర్ అంబెడ్కర్ డివిజన్ అధ్యక్షులు ప్రసాద్ వైస్సార్సీపీ నాయకులు విటల్, లోకేష్ లామ్ కిరణ్, అప్పారావు, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *