విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వేసవి కాలం సందర్భంగా వాహనాదారుల, పాదచారుల దాహార్తిని తీర్చడానికి విజయవాడ మున్సిపల్ కార్పోరేషన్ వారి ఆధ్వర్యంలో తూర్పు నియోజకవర్గంలో 16 చోట్ల చలివేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు నియోజకవర్గ వైస్సార్సీపీ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు. శనివారం నియోజకవర్గ పరిధిలోని బెంజ్ సర్కిల్, ఈనాడు ఎదురుగా ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ప్రారంభించి పాదచారులకు అవినాష్ మజ్జిగ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ వేసవికాలం లో పనుల మీద బయటకు వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా రద్దీ ఎక్కువ ఉన్న ప్రాంతాలలో మున్సిపల్ కార్పోరేషన్ వారు ఇలా చలివేంద్రాలు, మజ్జిగ పంపిణీ కేంద్రాలు ఏర్పాటు చేయడం అభినందనీయం అని అన్నారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు వల్ల ఎండ వేడిమి లో వడదెబ్బ తగలకుండా ప్రజలు అందరూ అప్రమత్తంగా ఉండాలని, తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వచ్చేవారు తగు జాగ్రత్తలు తీసుకోవాలి అని అవినాష్ సూచించారు. ఈ కార్యక్రమంలో 9వ డివిజన్ ఇన్ ఛార్జ్ గద్దె కళ్యాణ్, 11వ డివిజన్ ఇన్ ఛార్జ్ పర్వతనేని పవన్, ఈశ్వర్ ప్రసాద్, కార్పొరేషన్ అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News