Breaking News

ప్రజలకు చేసిన మంచిని సగర్వంగా చెప్పే దమ్ము వైసీపీ ప్రభుత్వానికి ఉంది : దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అన్ని వర్గాల ప్రజలకు మేలు జరిగేలా ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి సుపరిపాలన అందిస్తున్నారని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు. శనివారం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా 5వ డివిజన్,19వ సచివాలయం పరిధిలోని సి.ఓ.బి.సి చర్చి రోడ్ నుండి మొదలై కర్ర బాలస్వామి రోడ్డు ప్రాంతాలలో స్థానిక నాయకులు, సచివాలయ సిబ్బంది, వలంటీర్ లతో కలిసి ఇంటింటికి వెళ్లిన అవినాష్ ప్రభుత్వం ద్వారా వారి కుటుంబాలకు అందుతున్న సంక్షేమ లబ్ది వివరాల కరపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అర్హులైన ప్రతి ఒక్కరికి కులమత పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలు అందిస్తూ అన్నివర్గాల ప్రజలకు మేలు చేస్తున్నారని, అందుకే గడపగడపకు వెళ్లి ప్రభుత్వం చేస్తున్న మంచిని సగర్వంగా చేబుతున్నామని అన్నారు.గత తెలుగుదేశం ప్రభుత్వం లో ఇక్కడి కొండ ప్రాంతాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసారని, ఇక్కడి ప్రజలు నమ్మకంతో ఎన్నుకొన్న ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ గెలిచిన తర్వాత అసలు మొహం కూడా చూపించలేదని విమర్శించారు. కానీ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కొండ ప్రాంతం చివరి అంచు వరకు గడపకు కూడా సంక్షేమ లబ్ది అందజేయడం తో పాటు, కోట్ల రూపాయల నిధులు వెచ్చించి నూతన మెట్ల మార్గాలు, సైడ్ డ్రైనేజీ, మంచినీటి పైప్ లైన్ ఏర్పాటు చేసి అభివృద్ధి చేశామని, ప్రజల ఆరోగ్యం కోసం కోటి రూపాయలు వెచ్చించి ఆరోగ్య కేంద్రాన్ని ఏర్పాటు చేశామని అన్నారు. ఇక్కడ ఎన్నో ఏళ్లుగా నివసించే వారికి ఇళ్ల పట్టాల సమస్య ఉందని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లగా తక్షణమే సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కి ఆదేశాలు జారీ చేసారని,వీలైనంత త్వరగా వారికి ఇళ్ల పట్టాలు అందిస్తామని అవినాష్ భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో 5వ డివిజన్ కార్పొరేటర్ అంబెడ్కర్ డివిజన్ అధ్యక్షులు ప్రసాద్ వైస్సార్సీపీ నాయకులు విటల్, లోకేష్, సౌజన్యా, షకీలా, లామ్ కిరణ్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *