Breaking News

అనాధబాలలకు స్వచ్చంద సంస్థల ఆసరా అభినందనీయం..

-జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అనాధబాలలను ఆధరించి ఆదుకునేందుకు ముందుకు వచ్చి సహకరిస్తున్న స్వచ్చంద సంస్థల సహకారం వెలకట్టలేనిదని జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు అన్నారు.
మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో స్థానిక గవర్నర్‌ పేటలో నిర్వహిస్తున్న బాల సదన్‌లో ఆశ్రమానికి కోస్టల్‌ బ్యాంక్‌ అందించిన 1 లక్ష 50 వేల రూపాయల నిధులతో ఏర్పాటు చేసిన వాటర్‌ ప్లాంట్‌ను శనివారం జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు ప్రారంభించారు. ఈసందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ అనాధ పిల్లలకు అండగా మేము ఉన్నామని ముందుకు వస్తున్న దాతల సహకారం వెలకట్టలేనిదన్నారు. వీధి బాలలు, అనాధలు, పేద బలహీన వర్గాల పిల్లల సంక్షేమానికి ప్రభుత్వ పరంగా తీసుకుంటున్న చర్యలకు దాతల సహకారం తోడైతే విద్య, వైద్య ఆరోగ్య పరమైన సహకారం చిన్నారులకు అందించేందుకు వీలుంటుందన్నారు. కోస్టల్‌ బ్యాంకు అధికారులు సహ్రుదయంతో ముందుకు వచ్చి చిన్నారులకు రక్షిత మంచినీటి సౌకర్యం కల్పించేలా వాటర్‌ ప్లాంట్‌ను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. గతంలో బాల సదన్‌లో ఆశ్రయం ఉంటున్న చిన్నారులకు మంచి విద్యా బుద్దులు నేర్చుకునేందుకు సహకరిస్తామంటూ బార్‌ అసోసియేషన్‌ సభ్యులు ముందుకు వచ్చి పుస్తకాలు, దుస్తుల నందు పెయింటింగ్స్‌ వేయించడం, వేడి నీటి సౌకర్యం కొరకు గ్రీజర్‌, బట్టలు శుభ్రపరచుకునేందుకు వాషింగ్‌మిషన్‌లు బహుకరించడం జరిగిందన్నారు. బాల సదన్‌లో చిన్నారులకు ఆరోగ్య విషయాలను ఎప్పటికప్పడు గమనిస్తూ అవసరమైన పౌష్టికాహరాన్ని అందజేస్తూ పూర్తి పర్యవేక్షణ చేస్తున్న చైల్డ్‌ వెల్ఫేర్‌ కమిటి మెంబర్‌ రాధాకుమారిని అభినందిస్తున్నామన్నారు. చిన్నారులకు అవసరమైన దుస్తులు తయారు చేసుకునేందుకు న్యాయవాది వి. వనదుర్గ 70 వేల రూపాయల విలువగల కుట్టుమిషన్‌ను రోటరీ క్లబ్‌ సభ్యులు మిఠాయిలు పంపిణీ చేసి దాతృత్వాన్ని చాటుకున్నారని వీరి స్పూర్తితో అనాధులను ఆదుకునేందుకు దాతలు ముందుకురావాలని జిల్లా కలెక్టర్‌ డిల్లీరావు కోరారు.
కార్యక్రమంలో ఐసిడిఎస్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌ జి. ఉమాదేవి, చైల్డ్‌ వెల్ఫేర్‌ కమిటి సభ్యురాలు చంద్రగిరి రాధాకుమారి, కోస్టల్‌ బ్యాంకు ఏజియం జె ఎస్‌ ఆర్‌ ఆంజనేయులు, మేనేజర్‌ వి. రామకృష్ణ, బాల సదన్‌ పర్యవేక్షకురాలు జోత్స్న, వసతి గృహ పర్యవేక్షకురాలు వి. సూర్యకుమారి, సిడిపివోలు కె.మంగమ్మ, జి. నాగమణి, పుష్పలత, లలితాకుమారి, రోటరీ క్లబ్‌ సభ్యులు చిన్నం రామకృష్ణ, సూరిబాబు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *