Breaking News

ఇఫ్తార్‌ విందుకు ఏర్పాట్లను పూర్తి చేయండి..

-ముస్లీమ్‌ సోదరుకు అసర్‌ నమాజ్‌, మగ్రీబ్‌ నమాజ్‌కు ఏర్పాట్లు..
-ముస్లిం సోదరులు ఇఫ్తార్‌ విందును జయప్రదం చేయండి..
-డిప్యూటీ సియం అంజాద్‌ బాషా

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పవిత్ర రంజాన్‌ మాసాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వ తరుపున ముస్లీమ్‌ సోదరులకు ఈనెల 17వ తేదీన నిర్వహించే ఇఫ్తార్‌ విందుకు అవసరమైన ఏర్పాట్లను పూర్తి చేసి సర్వం సిద్దం చేయాలనిడి రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి ఎస్‌ బి అంజాద్‌ బాషా అధికారులు ఆదేశించారు. ఈనెల 17వ తేదీన విద్యాదరపురం బైపాస్‌ రోడ్డులో గల ఆర్‌టిసి వర్క్‌ షాపు రోడ్డులో గల స్టేడియం నందు నిర్వహించనున్న ఇఫ్తార్‌ విందు ఏర్పాట్లను శనివారం ఉపముఖ్యమంత్రి అంజాద్‌ బాషా, జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు, శాసనసభ్యులు వెలంపల్లి శ్రీనివాసరావులు సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి ఎస్‌ బి అంజాద్‌ బాషా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తరుపున ఈనెల 17వ తేదీన ముస్లిం, మైనార్టీ సోదరులకు ఇఫ్తార్‌ విందును ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. విద్యాదరపురం స్టేడియం గ్రౌండ్‌ నందు నిర్వహించే ఇఫ్తార్‌ విందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్య అతిధిగా హాజరుకానున్నట్లు తెలిపారు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లను త్వరితగతిన పూర్తి చేసి ఆదివారం సాయంత్రానికి సర్వం సిద్దం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించామన్నారు. సాయంత్రం 5 గంటల నుండి ముస్లీం సోదరులు ఇఫ్తార్‌ విందుకు హాజరు కానున్నారన్నారు. ముస్లిం సోదరులు స్టేడియం నందు అసర్‌ నమాజ్‌ చేసుకునే సౌకర్యం కల్పించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. సుమార్‌ 5 వేల మందికి పైగా సామూహిక మగ్రీబ్‌ నమాజ్‌ చేసుకునేలా ఏర్పాటు ఉండాలన్నారు. నమాజ్‌కు ముందు ఒక్కపొద్దు విడిచినప్పుడు ముస్లిం సోదరులు ప్రతి ఒక్కరికి అల్పాహారంగా పండ్ల ముక్కలు, ఖర్జూర, గంజి, బూందిలను అందచేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. నమాజ్‌ అనంతరం ఇఫ్తార్‌ విందు భోజనం అందించేందుకు అవసరమైన కౌంటర్లను ఏర్పాటు చేయాలన్నారు. ఇఫ్తార్‌ విందుకు హాజరయ్యే ప్రముఖులు పార్లమెంట్‌ సభ్యులు, శాసన మండలి సభ్యులు, శాసనసభ్యులు, వివిధ కార్పొరేషన్‌ సభ్యులు, ఉన్నతాధికారులకు ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయాలని ఉప ముఖ్యమంత్రి అంజాద్‌ బాషా కోరారు. ఏర్పాట్ల పరిశీలినలో ఉప ముఖ్యమంత్రి అంజాద్‌ బాషా వెంట జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు, సబ్‌ కలెక్టర్‌ అదితి సింగ్‌, శాసనమండలి సభ్యులు యండి రూహుల్లా, నగర మేయర్‌ రాయన భాగ్యలక్ష్మి, తూర్పు నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ దేవినేని అవినాష్‌, సిఇవో అబ్దుల్‌ ఖాధీర్‌, జిల్లా వక్ఫ్‌బోర్డ్‌ ఖాజా మస్తాన్‌, ముస్లీం మత పెద్దలు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *