Breaking News

సమాజాభివృద్ధిలో యువతది కీలక పాత్ర..

-యువత తోనే సామాజిక సమస్యల పరిష్కారం..
-జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సమాజాభివృద్ధిలో యువతదే కీలక పాత్ర అని సామాజిక సమస్యలను పరిష్కారంలో లైన్స్‌ లియోలు దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు కోరారు.
స్థానిక తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఆదివారం లయన్స్‌ ఇంటర్‌నేషన్‌ డిస్ట్రిక్ట్‌ 316డి ఆధ్వర్యంలో నిర్వహించిన లియో డిస్ట్రిక్ట్‌ ఫార్మెషన్‌ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్‌ డిల్లీరావు ముఖ్య అతిధిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ డిల్లీరావు మాట్లాడుతూ సమాజాభివృద్ధిలో యువ శక్తిని మించినది లేదన్నారు. యువత విద్యార్థి దశ నుండే సేవా భావాన్ని అలవర్చుకోవాలన్నారు. సమాజానికి సేవ చేయడం గొప్పతనంగా బావించాలన్నారు. సామాజిక సేవలలో పేద దనిక వర్గాల తారతమ్యం ఉండదన్నారు. నానాటికి పెరుగుతున్న శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం వలన నేటి యువత పెడమార్గాలను అనుసరించడం శోచనీయమన్నారు. యువత సన్మార్గంలో నడిపించేందుకు సేవా భావం దోహదపడుతుందన్నారు. పర్యావరణం, విద్య, వైద్య రంగాలను ప్రధానాంశాలుగా తీసుకుని ఆయా రంగాలలో సూక్ష్మ స్థాయిలో ఆలోచించి సామాజిక పరమైన సేవలందించడం ద్వారా ప్రజలకు మేలు చేసేందుకు యువత కృషి చేయాలన్నారు. లియో అనేది సింహానికి అర్థం సూచిస్తుందని సింహా ఏవిధంగా ఒత్తిడిని తట్టుకుని పోరాట పట్టిమను చూపిస్తుందో లయన్స్‌ లియోను కూడా అదే మార్గాన్ని అనుసరించి అటుపోటులను ఎదుర్కొని సామాజిక అభివృద్ధికి దోహదపడలాన్నారు. సమాజాన్ని ఉన్నత స్థాయికి తీసుకువెళెందుకు లయన్స్‌ లియోసు కృషి చేయాలని కోరారు. స్థానిక సంస్థలు ప్రజా ప్రతినిధులు సహకారంతో నిర్వహించే సామాజిక సేవ కార్యక్రమాలు విజయవంతం అవుతాయని ఇందుకు కృషి చేస్తే లియో సభ్యులకు జిల్లా యంత్రాంగం పూర్తి సహకారం అందిస్తుందని జిల్లా కలెక్టర్‌ డిల్లీరావు తెలిపారు.
లయన్స్‌ ఇంటర్నేషనల్‌ డిస్ట్రిక్ట్‌ గవర్నర్‌ డి. దామర్ల శ్రీ శాంతి మాట్లాడుతూ లైన్స్‌ డిస్ట్రిక్ట్‌ పరిధిలో 14 క్లబుల ద్వారా 240 మంది లియో సభ్యులుగా సభ్యత్వం తీసుకోవడం జరిగిందన్నారు. నాయకత్వం, అనుభవం, అవకాశం వంటి అంశాలపై లియో సభ్యులు అవగాహన కల్పించడం ద్వారా ఉత్తమ లక్షణాలను కల్పిస్తామన్నారు. సామాజానికి తిరిగి ఇచ్చేందుకు అనేక మార్గలు ఉన్నయన్నారు. లియో క్లబులను ఎంచుకోవడం ద్వారా విద్యార్థి దశ నుండే నాయకత్వ లక్షణాలు ఏర్పాడతాయన్నారు. లయన్స్‌ ఇంటర్‌నేషన్‌ ఆధ్వర్యంలో లియో యువత సామాజిక సేవ కార్యక్రమాలు నిర్వహించి సమాజాభివృద్ధికి దోహదపడలన్నదే తమ లక్ష్యమని ఆమె తెలిపారు. అనంతరం లియో డిస్ట్రిక్ట్‌ ఫార్మెషన్‌ ఏర్పాటు చేసి లియో సభ్యులతో ప్రమాణస్వీకారం చేయించారు.
కార్యక్రమంలో లయన్స్‌ ఇంటర్నేషనల్‌ ప్రతినిధులు లైన్‌ అంబటి మదుమోహన్‌కృష్ణ, లక్ష్మ పద్మజ, ప్రభాకర్‌రావు ఏఆర్‌కె చౌదరి, శంకర్‌గుప్తా, పర్వతనేని శుభాష్‌బాబు, దామర్ల శ్రీనివాస్‌రావు, ఇన్‌ఫ్యాక్టు ట్రైనర్‌ గంప నాగేశ్వరరావు, లయన్స్‌ క్లబ్‌ సభ్యులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *