Breaking News

ప్రశాంతంగా నేషనల్ డిఫెన్స్, నావల్ అకాడమీ, కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ పరీక్షల నిర్వహిణ… : జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ ఆధ్వర్యంలో జరిగే నేషనల్ డిఫెన్స్, నావల్ అకాడమీ, కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ పరీక్షలను ప్రశాంతంగా నిర్వహించిన్నట్లు జిల్లా కలెక్టర్ యస్ డిల్లీ రావు తెలిపారు. కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ పరీక్ష, నేషనల్ డిఫెన్స్, నావల్ అకాడమీ పరీక్షా కేంద్రాలను ఆదివవారం ఉదయం జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు పరిశీలించారు. నగరంలోని బిషప్ అజయ్య పాఠశాలలోని పరీక్ష కేంద్రాన్ని సందర్శించిన అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ నిర్వహించే నేషనల్ డిఫెన్స్, నావల్ అకాడమీ పరీక్షలకు 1,226 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 869 మంది విద్యార్థులు హాజరు అయ్యారని, 357 మంది గైరుహాజరు అయ్యారని తెలిపారు. శ్రీ దుర్గామల్లేశ్వర సిద్ధార్ధ మహిళ కళాశాల, కాకరపర్తి భావనారాయణ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాలలో నేషనల్ డిఫెన్స్, నావల్ అకాడమీ పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. పరీక్షల నిర్వహణకు 104 మంది ఇన్విజిలేటర్లు, 5 మంది లైజన్ ఆఫీసర్లు 8 మంది అసిస్టెంట్ సూపర్వైజర్లను నియమించామన్నారు. కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ పరీక్షలను బిషప్ అజారయ్య మహిళ జూనియర్ కళాశాల, పిబి సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో నిర్వహించినట్లు తెలిపారు. పరీక్ష కేంద్రాలలో 70 మంది ఇన్విజిలేటర్లు, ఇద్దరు లైజన్ ఆఫీసర్ల నియమించామన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద పటిష్టమైన పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేయాలడం జరిగిందన్నారు. అభ్యర్థులు పరీక్ష కేంద్రంలోకి క్యాలిక్యూలేటర్లు, ఎలక్ట్రానిక్ వస్తువులను అనుమతించకుండా చర్యలు తీసుకున్నామన్నారు. ఎటువంటి లోటుపాట్లు లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో సజావుగా నిర్వహించేందుకు కృషి చేసిన అధికారులను సిబ్బందిని అభినందిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు తెలిపారు. పరీక్ష కేంద్రాల పరిశీలనలో జిల్లా కలెక్టర్ వెంట యుపిఎస్సి అసిస్టెంట్ డైరెక్టర్ పంకజ్ కుమార్, సెంట్రల్ తహశీల్దార్ వెన్నెల శ్రీను, సూర్యారావుపేట స్టేషన్ ఆఫీసర్ జి. ఫణీంద్రలు ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *