Breaking News

12వ డివిజన్ ఫారూఖ్ నగర్ జమీ మస్జీద్ లో ఇఫ్తార్ విందు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా 12వ డివిజన్ ,ఫారూఖ్ నగర్ మసీదు నందు e ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు లో తూర్పు నియజకవర్గ వైసీపీ ఇంచార్జ్ దేవినేని అవినాష్ హాజరయ్యారు. ఈ సందర్భంలో అవినాష్ మాట్లాడుతూ రంజాన్ మాసంలో దైవ చింతన తో నెల రోజుల పాటు నియమబద్ధ జీవితం గడపడం వల్ల చక్కని క్రమశిక్షణ, ఓర్పు, సానుభూతి, సేవాభావం వంటి సద్గుణాలు అలవడడంతోపాటు జీవితంలో ఎలాంటి కఠిన పరీక్షలనైనా ఎదుర్కోగలమనే ఆత్మవిస్వాసం పెంపొందుతుందన్నారు. శుభాలు వర్షించే వరాల వసంతం రంజాన్ అని ఆయన అన్నారు.జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో ముస్లింలకు అనేక పథకాలు అమలు చేశామని చెప్పారు.ఈ సందర్భంలో దేవినేని అవినాష్ రంజాన్ మాస శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో హజ్ కమిటీ చైర్మన్ గౌస్ సలాం, కృష్ణా జిల్లా మాజీ వక్ఫ్బోర్డ్ చైర్మన్ మీర్ హుస్సేన్,12వ డివిజన్ అధ్యక్షలు రిజ్వాన్, వైస్సార్సీపీ నాయకులు మెహబూబ్,రామయనపు శ్రీనివాస్,ఖలీమ్,హసన్ మరియు ముస్లిం పెద్దలు,మసీదు కమిటీ పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *