Breaking News

బెజవాడ వాసులు కళా ప్రియులు : సందీప్ మండవ

-ఉత్సాహంగా ప్రారంభమైన పిచ్వాయి, తంజోర్, గోండు చిత్ర లేఖన సదస్సు
-నగర ప్రజల సందర్శనార్ధం ప్రత్యేకంగా ఆర్ట్ ఎగ్జిబిషన్
-క్రియేటివ్ సోల్ వ్యవస్ధాపకులు సుమన్ మీనా, నేహా జైన్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పిచ్వాయి, తంజోర్, గోండు చిత్ర లేఖన అభిమానులకు వినూత్న అవకాశాన్ని కల్పిస్తూ క్రియేటివ్ సోల్ ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం అభినందనీయమని మాలక్ష్మి గ్రూపు సిఇఓ సందీప్ మండవ అన్నారు. ఇతర రాష్ట్రాల కళలను తెలుగు ప్రజలకు పరిచయం చేసేలా నగరంలోని కల్చరల్ సెంటర్ ఆప్ విజయవాడ, అమరావతి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వర్క్ షాపును సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సందీప్ మాట్లాడుతూ విజయవాడ ప్రజలు ఎప్పుడు కళలకు మంచి ప్రోత్సాహకులుగా ఉన్నారని, ప్రత్యేకించి యువత ఉత్సాహంగా ముందుకు రావటం అభినందనీయమన్నారు. కల్చరల్ సెంటర్ ఆఫ్ విజయవాడ కళలకు తగిన ప్రోత్సాహం అందిస్తుందన్నారు. క్రియెటివ్ సోల్ వ్యవస్దాపకులు సుమన్ మీనా, నేహా జైన్ మాట్లాడుతూ పిచ్వాయి, తంజోర్, గోండు చిత్రలేఖనంలో ఆరితేరిన శిక్షకుల ద్వారా వర్క్ షాపును నిర్వహిస్తున్నామన్నారు. నగర ప్రజల సందర్శనార్ధం ప్రత్యేక ప్రదర్శనను కూడా అందుబాటులోకి తీసుకురానున్నామన్నారు. ఉధయం 10 నుండి 12గంటల వరకు గోండు, మద్యాహ్నం మూడు నుండి ఐదు వరకు తంజోర్, సాయంత్రం ఆరు నుండి ఎనిమిది గంటల వరకు పిచ్వాయి చిత్రలేఖనంపై అభ్యాసం ఉంటుందన్నారు. శిక్షణకు అవసరం అయిన పూర్తి సామాగ్రిని క్రియేటివ్ సోల్ సమకూర్చుతుందని, ఇందుకోసం నామమాత్రపు రుసుము చెల్లించవలసి ఉంటుందని, 23వ తేదీ వరకు వర్క్ షాపు జరుగుతుందని వివరించారు. ఆసక్తిగలవారు 7893911717, 8008268885 నెంబర్లలో సంప్రదించవచ్చని, వయస్సుతో నిమిత్తం లేకుండా ఎవరైనా అభ్యసించవచ్చని సుమన్ మీనా, నేహా జైన్ తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *