Breaking News

మీ అందరి ప్రార్థనలు సఫలం కావాలి… దేవుని ఆశీస్సులతో అందరూ బాగుండాలి… : సీఎం జగన్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రంజాన్ మాసం సందర్భంగా సోమవారం ముస్లిం సోదరులకు ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాల్గొన్నారు. విజయవాడ విద్యాధరపురంలోని మినీ స్టేడియంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి సుమారు 15 వేల మంది హాజరయ్యారు. ఈ సందర్బంగా సీఎం జగన్ ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. మీ అందరి ప్రార్థనలు సఫలం కావాలని ఆకాంక్షించారు. దేవుని ఆశీస్సులతో అందరూ బాగుండాలని తెలిపారు. రాష్ట్రాభివృద్ధి కోసం అందరూ ప్రార్థించాలని సూచించారు. డిప్యూటీ సీఎం అంజాద్ భాషా మాట్లాడుతూ దేశంలో ఎక్కడాలేని విధంగా ఏపీలో మైనార్టీలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వంలో మైనార్టీలకు ఎంతో మేలు జరిగిందని తెలిపారు. మైనార్టీల సంక్షేమం కోసం ఎక్కువ నిధులు ఇచ్చిన రాష్ట్రం ఏపీనేనని పేర్కొన్నారు. మైనార్టీ వర్గానికి డిప్యూటీ సీఎం ఇచ్చిన ఘనత జగన్దేనని ప్రశంసించారు. గత ప్రభుత్వం మైనార్టీలను పట్టించుకోలేదని విమర్శించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *