Breaking News

జనసేన పార్టీ విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఇంచార్జ్ పోతిన వెంకట మహేష్ ఆధ్వర్యంలో రంజాన్ కానుక పంపిణీ కార్యక్రమం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పశ్చిమ నియోజకవర్గ ఇంచార్జ్ పోతిన వెంకట మహేష్ ఆధ్వర్యంలో పవిత్ర రంజాన్ ను పురస్కరించుకొని పేద సామాన్య ముస్లిం కుటుంబాలకు రంజాన్ కానుక పంపిణీ కార్యక్రమం చిట్టినగర్ మోతి మసీద్ ప్రాంగణంలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా కృష్ణాజిల్లా అధ్యక్షులు బండ్రెడ్డి రామకృష్ణ, రాష్ట్ర కార్యదర్శి అమ్మిశెట్టి వాసు, , మైలవరం ఇంచార్జ్ ఇన్చార్జి, అక్కల రామ్మోహన్ రావు (గాంధీ), సెంట్రల్ నియోజకవర్గ నాయకులు బొలిశెట్టి వంశీ, ప్రముఖ న్యాయవాది పిల్లా శ్రీనివాసరావు, మోతి మసీద్ అధ్యక్షులు కాజా, నగర ఉపాధ్యక్షులు వెన్న శివశంకర్ కమల్ల సోమనాథం పాల్గొని ముస్లిం సోదరులందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు.
ముస్లిం మత పెద్దలు రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ప్రార్థనలు చేయడం జరిగింది అనంతరం వారికి బట్టలు బహుమానం అందించడం జరిగింది.
1200 మంది ముస్లింలకు 9 ఐటమ్స్ తో కూడిన రంజాన్ కానుక కిట్ ను అందజేయడం జరుగుతుంది. (ఈ కిట్ యందు1 కేజీ బాసుమతి బియ్యం, 1 కేజీ గోధుమపిండి ,1/2 కేజీ సేమియా ,1/2 కేజీ పంచదార ,200 గ్రాముల మంచి నూనె ,10 గ్రాముల నెయ్య ,50 గ్రాముల పసుపు ,50 గ్రాముల కారం,1 చేతి సంచి) ఈ సందర్భంగా పాల్గొన అతిథులు మరియు మహేష్ ప్రతి ఒక్కరికి రంజాన్ శుభాకాంక్షలు జనసేన పార్టీ తరఫున మరియు పవన్ కళ్యాణ్ గారి తరపున తెలియజేస్తున్నామని భగవంతుడు అల్లా ఆశీస్సులతో ప్రతి ఒక్కరు ఆనందంగా ఉండాలని శుభాకాంక్షలు తెలియజేసినారు. పోతిన మహేష్ ప్రతి సంవత్సరం పశ్చిమ నియోజకవర్గం జనసేన పార్టీ తరపున పేద, సామాన్య ముస్లిం కుటుంబాలకు రంజాన్ కానుక అందజేయడం జరుగుతుందని అదేవిధంగా మా జనసేన పార్టీ నాయకులు పవన్ కళ్యాణ్ గారు పశ్చిమ నియోజకవర్గం లోని దారుల్ వుర్లు హలేమా మదర్సా కు ఐదు లక్షల రూపాయలు చెక్ రూపంలో అందజేయడం జరిగిందని ఈ సందర్భంగా మాట్లాడటం జరిగింది. ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమాన్ని స్థానిక డివిజన్ అధ్యక్షులు కోరగంజి వెంకటరమణ అతిథులను వేదికపైకి ఆహ్వానించారు. మైనారిటీ నాయకులు షేక్ అమీర్ భాష, సయ్యద్ మొబినా, షేక్ షహినా, s కరిముళ్ళ, sd కరిముళ్ల ,రఫీ తదితరులు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు, ఈ కార్యక్రమాo లో అడ్డూరి తమ్మారావు, రెడ్డిపల్లి గంగాధర్ ,పొట్నూరి శ్రీనివాసరావు, సోమి గోవిందరావు, నల్లబిల్లి కనకారావు, సింగినం శెట్టి రాము, ఆకుల రవిశంకర్, నేమాల సంజీవరావు,పిల్ల వంశీ , ఏలూరు సాయి శరత్ బొమ్మ రాంబాబు తిరుపతి అనూష కూరాకుల సురేష్ m.హనుమాన్ తదితరులు పాల్గొనడం జరిగింది.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఈగల్ పోస్టర్లను, డ్రగ్స్ వద్దు బ్రో బ్యానర్ ను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్, ఎస్పి లు

-ఆపరేషన్ త్రిశూల్’లో భాగంగా డ్రగ్స్, మహిళల భద్రత, రోడ్డు ప్రమాదాల నియంత్రణకు సమగ్ర కార్యాచరణ -మైక్రో లెవెల్‌లో సమస్యలను గుర్తించి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *