Breaking News

ప్రపంచ కాలేయ దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించిన కామినేని హాస్పిటల్స్

-ఆరోగ్యకరమైన అలవాట్లతో కాలేయాన్ని కాపాడుకొండి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడలోని ప్రముఖ ఆరోగ్య సేవా సంస్థ అయిన కామినేని హాస్పిటల్స్ ఏప్రిల్ 19న వరల్డ్ లివర్ డే పాటిస్తున్న సందర్భంగా అసాధారణ శక్తిని, వ్యక్తి పట్ల విధేయతను ప్రదర్శించే కాలేయం ఎదుర్కొంటున్న సవాళ్లు, దానిని కాపాడుకొవటానికి గల అవకాశాలను మరియు మితిమీరిన మద్యపానం యొక్క పర్యవసానాలపై అవగాహన కల్పించడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది.

మెదడు తరువాత కాలేయమే మన శరీరంలోని అతి పెద్ద అవయవం, మనం తినే, తాగే, వేసుకునే మందులు కూడా చివరకు కాలేయం గండా ప్రయాణించాల్సిందే. జీర్ణమయిన ఆహార పదార్థాలు. కరిగి కలిసిపోయిన మందులతో కూడిన రక్తన్ని జాగ్రత్తంగా వడబో సే కాలేయం దానిలో ప్రమాదకర రసాయనాలను తొలగించివేస్తుంది. ఇన్ఫెక్షన్లతో పోరాడుతుంది. రక్తంలో చక్కెర శాతాన్ని క్రమబద్దం చేస్తుంది. కొలస్ట్రాల్ శాతాన్ని అదుపుచేస్తుంది. జీర్ణక్రియకు తోడ్పడే పైత్యరసం(బైల్)ను విడుదలచేస్తుంది.

భారతీయ జనాభాలో ఆల్కహాల్ వినియోగం అధికంగా ఉంది, 14.6 మిలియన్ల మంది ప్రజలు క్రమం తప్పకుండా మద్యం సేవిస్తున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. మద్యం మత్తు కిక్కు ఇస్తుందన్నది అందరికీ తెలిసిందే. అది హద్దుమీరితే జరిగే పరిణామాలను గూర్చి మాత్రం చాలా మందికి తగినంత అవగాహన ఉండటంలేదు. రోజుకు 10 నుంచి 20 మి.లీ.లచొప్పున వారానికి రెండు, మూడు సార్లు మద్యం తీసుకోవటాన్ని నిపుణులు ‘గరిష్ట పరిమితి’గా పేర్కొంటున్నారు. అంతకు మించిన మద్యపానాన్ని ‘మితిమీరి సేవించటం’గా స్పష్టం చేస్తున్నారు. ఈ విధమైన అలవాటు వల్ల పలురకాల కాలేయవ్యాధులు, కాన్సర్లు, గుండెవ్యాధులు వస్తాయి. భారతదేశంలో ఆల్కహాలిక్ కాలేయ వ్యాధుల ప్రాబల్యం ఇటీవలి సంవత్సరాలలో పెరిగింది. ఇది దేశ జనాభాలో 2% వరకు ప్రభావితం చేస్తుందని ఒక అంచనా.

మితిమీరి మద్యం తీసుకోవటం పలురకాల కాలేయసమస్యలకు దారితీస్తుంది. వీటిలో ఫాటీలివర్, హెపటైటిస్, లివర్ సిరోసిస్ తీవ్రమై ఆనారోగ్యానికి కారణమవటమే కాకుండా అలక్ష్యం చేసే ప్రాణాంతకం అవుతాయి కూడా. కాలేయ వ్యాధుల కారణంగా జరుగుతున్న మరణాలలో దాదాపు మూడో వంతు(35శాతం)కు కారణం అధిక మద్యపానమేనని అంచనా.

ఈ సందర్బంగా కామినేని హాస్పిటల్స్ సీనియర్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ వంశీ చైతన్య గూడే మాట్లాడుతూ, ఆరోగ్యకరమైన కాలేయంతో మరియు సంతృప్తికరమైన జీవితాన్ని గడపడానికి పరిమితికి మించిన స్థాయిలో ఆల్కహాల్ తీసుకోకపోవడం, సమతుల్య ఆహారం తీసుకోవడం మరియు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం చేయడం ముఖ్యమైనవి. కాలేయ వ్యాధి లక్షణాల గురించి తెలుసుకోవడం మరియు ముందస్తుగా గుర్తించడం చాలా ముఖ్యం, ఎందుకంటే నిర్లక్ష్యం చేయబడిన కేసులు కోలుకోలేని నష్టాన్ని కలిగించడమే కాకుండా, అది కాలేయ కాలేయ మార్పిడికి కూడా దరి తీస్తుంది.” అని తెలిపారు.

విజయవాడలోని కామినేని హాస్పిటల్స్ సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ ఎస్వీ పవన్ ఈశ్వర్ వేలినేని మాట్లాడుతూ.. కాలేయ వ్యాధులను ముందుగా గుర్తిస్తే మందులతో నయం చేయవచ్చన్నారు. కాలేయం తనకు నష్టం కలిగిస్తున్న అలవాటును గుర్తించి సరిచేసుకోవటానికి వ్యక్తికి చాలా అవకాశం ఇస్తుంది. కానీ ఆ అలవాటు వల్ల నష్టం తీవ్రమై, వ్యాధులకు దారి తీస్తున్నా నిర్లక్ష్యం చేస్తూ నష్టం కలిగించే అలవాట్లను మానకపోయినపుడు ఒక్కసారిగా కుప్పగూలిపోతుంది. అధిక మద్యపానం కారణంగా ఏర్పడే ఫాటీ లివర్, హెపటైటిస్, లివర్ సిరోసిస్ వంటి కొన్ని వ్యాధుల కారణంగా ఈ పరిస్థతి ఏర్పడుతుంది. ఇది చివరకు ఎండ్ స్టేజ్ లివర్ డిసీజ్ కు కారణం అవుతుందని అన్నారు. కాలేయానికి జరిగిన నష్టాన్ని బట్టి దానిని మూడు స్థాయిలుగా గుర్తిస్తారు. వీటిని ఎ, బి, సి. ‘ఛైల్డ్ పగ్ స్టేజెస్’ అంటున్నారు. ‘ఎ’ ఛైల్డ్ స్థాయిలోనే డాక్టర్ వద్దకు రాగలిగితే మందులతో, అలవాట్లలో మార్పులతో చికిత్సచేసి పూర్తి సాధారణ పరిస్థితిని పునరుద్దరించవచ్చు. మొదటి రెండు (ఎ.బి. ఛైల్డ్ స్టేజెస్)స్థాయిల్లోనూ చాలా వరకు తిరిగి కోలుకోవటానికి కాలేయం అవకాశం ఇస్తుంది. బి, సి స్థాయిలలో దశకు చేరుకుంటే, కాలేయ మార్పిడి అవసరం కావచ్చు.” అని అన్నారు.

విజయవాడలోని కామినేని హాస్పిటల్స్‌ సిఒఒ డాక్టర్‌ వి నవీన్‌ కుమార్‌ మాట్లాడుతూ, “దక్షిణ భారతదేశంలో కాలేయ వ్యాధుల చికిత్స మరియు కాలేయ మార్పిడి ఆపరేషన్ల నిర్వహణలో కామినేని హాస్పిటల్స్ కొత్త ఒరవడిని ప్రవేశపెట్టింది. వందలకు పైగా కాలేయ మార్పిడి శస్త్రచికిత్సలు చేసిన అనుభవజ్ఞులైన సర్జన్లు విజయవాడలో స్థానికంగా అందుబాటులో ఉన్నారు. దీని కారణంగా, దేశంలోని ఇతర వైద్య సంస్థలు మరియు ఆసుపత్రులతో పోలిస్తే ఈ శస్త్రచికిత్స ఖర్చు సగం తగ్గింది. రోగనిర్ధారణ పరీక్షలు, శక్తివంతమైన మందులు, ఖచ్చితమైన శస్త్రచికిత్సలు మరియు అధిక విజయవంతమైన కాలేయ మార్పిడి శస్త్రచికిత్సలు కాలేయ వ్యాధుల నుండి నమ్మకమైన ఉపశమనాన్ని అందిస్తున్నాయి. అని తెలిపారు.

వ్యక్తులు అధిక ఆల్కహాల్ తీసుకోవడం వల్ల కలిగే నష్టాల గురించి తెలుసుకోవడం మరియు బాధ్యతాయుతంగా తాగడం చాలా ముఖ్యం. ప్రజారోగ్య కార్యక్రమాల ద్వారా మితిమీరిన మద్యపానం వల్ల కలిగే ప్రమాదాలపై అవగాహన పెంచడం మరియు వారిని చైతన్యపరిచి మద్యపానాన్ని తగ్గించడంలో అవసరమైన వారికి వనరులను అందించడం ముఖ్యమైనది. మనమందరం మన అతిపెద్ద గ్రంథి పట్ల దయ చూపుతామని మరియు ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపాలని ప్రతిజ్ఞ చేద్దాం.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *