Breaking News

క్షేత్ర స్థాయిలో పారిశుధ్య నిర్వహణ తీరు పరిశీలన

-విధులలో అలసత్వం వహించకుండా భాద్యతగా నిర్వర్తించాలి
-కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్ బుధవారం 4వ డివిజన్ గురునానక్ కాలనీ, కనకదుర్గ గెజిటెడ్ ఆఫీసర్స్ కాలనీ పలు వీధులలో పారిశుధ్యo నిర్వహణ విధానమును పరిశీలించి సంబంధిత అధికారులకు పలు ఆదేశాలు ఇచ్చారు. పారిశుధ్య కార్మికుల యొక్క విధులను పర్యవేక్షించి వారి యొక్క మస్తరు విధానము పరిశీలించారు. ప్రధానంగా మెరుగైన పారిశుధ్య నిర్వహణ విధానము అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని, ప్రతి పారిశుధ్య కార్మికులు చేతి తొడుగులు ధరించాలని శానిటరీ ఇన్స్పెక్టర్ కు పలు ఆదేశాలు ఇచ్చారు. చెత్త సేక‌ర‌ణ‌తో పాటు ఆయా డివిజన్ లలో మురుగునీటి పారుద‌ల వ్య‌వ‌స్థ‌ను పరిశీలించి, న‌గ‌రంలో దోమ‌లు బెడ‌ద లేకుండా లార్వా దశలో దోమల పెరుగుదలను నివారించే యాంటి లార్వా ఆపరేషన్ పనులు నిర్వహించాలని సంబంధిత అధికారులకు పలు ఆదేశాలు ఇచ్చారు. అదే విధంగా డివిజన్ లలో నూరు శాతం డోర్ టు డోర్ బాస్కెట్ కలెక్షన్ జరిగేలా చర్యలు తీసుకోవాలని ప్రజారోగ్య శాఖాధికారులను ఆదేశించారు. ఈ పర్యటనలో శానిటరీ ఇన్స్ పెక్టర్లు, శానిటరీ సెక్రెటరీలు మరియు సచివాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *